వీణ స్టెప్పు ట్రైచేశా... కానీ బాగాలేదు

స్టెప్స్ విషయంలో పవన్ కాస్త వీకే. కెరీర్ స్టార్టింగ్ లో అప్పుడెప్పుడో వచ్చిన బద్రి, తమ్ముడు, ఖుషి లాంటి సినిమాల్లో అడపాదడపా అక్కడక్కడ చిన్నచిన్న స్టెప్పులేసినప్పటికీ…. ఆ తర్వాత పూర్తిగా తగ్గించేశాడు. అసలు మెగా కాంపౌండ్ హీరోలంటేనే స్టెప్స్ ఇరగదీయాలి అనే అంచనాల్ని తలకిందులు చేశాడు. స్టెప్స్ లేకుండా మేనేజ్ చేస్తూనే సూపర్ స్టార్ డమ్ తెచ్చుకున్నాడు. నిజానికి పవన్ కల్యాణ్ ను వెన్ను, మోకాళ్ల నొప్పులు కొన్నేళ్లుగా బాధిస్తున్నాయి. అందుకే భారీ స్టెప్పులకు ఎప్పుడో బైబై […]

Advertisement
Update: 2016-03-19 11:22 GMT
స్టెప్స్ విషయంలో పవన్ కాస్త వీకే. కెరీర్ స్టార్టింగ్ లో అప్పుడెప్పుడో వచ్చిన బద్రి, తమ్ముడు, ఖుషి లాంటి సినిమాల్లో అడపాదడపా అక్కడక్కడ చిన్నచిన్న స్టెప్పులేసినప్పటికీ…. ఆ తర్వాత పూర్తిగా తగ్గించేశాడు. అసలు మెగా కాంపౌండ్ హీరోలంటేనే స్టెప్స్ ఇరగదీయాలి అనే అంచనాల్ని తలకిందులు చేశాడు. స్టెప్స్ లేకుండా మేనేజ్ చేస్తూనే సూపర్ స్టార్ డమ్ తెచ్చుకున్నాడు. నిజానికి పవన్ కల్యాణ్ ను వెన్ను, మోకాళ్ల నొప్పులు కొన్నేళ్లుగా బాధిస్తున్నాయి. అందుకే భారీ స్టెప్పులకు ఎప్పుడో బైబై చెప్పేశాడు. కానీ సర్దార్ గబ్బర్ సింగ్ లో మాత్రం ఎలాగోలా కష్టపడి ఓ క్రేజీ స్టెప్ ట్రైచేశాడు పవర్ స్టార్. అదే చిరంజీవి మార్క్ వీణ స్టెప్పు. సినిమాలో భాగంగా… అన్నయ్య వేసిన వీణ స్టెప్పును తను కూడా ట్రైచేశానని ప్రకటించాడు పవన్. అయితే అది సరిగ్గా రాలేదన్నాడు. తనకంటే అన్నయ్యే బాగా వేశాడని మెచ్చుకున్నాడు. వీణ స్టెప్పు మాత్రమే కాదు… ఏ స్టెప్ అయినా చిరంజీవే బాగా వేస్తాడు. ఆ విషయంలో చిరంజీవి తర్వాతే పవన్ కల్యాణ్. ఈ విషయాన్ని ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే. కానీ పవన్ ఇలా స్వయంగా ఒప్పుకోవడం మెగాబ్రదర్స్ మధ్య సాన్నిహిత్యం పెరిగిందనడానికి నిదర్శనం.
Tags:    
Advertisement

Similar News