ఫినిషింగ్ టచ్ ఇచ్చిన మహేష్ బాబు

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ప్రారంభించిన బ్రహ్మోత్సవం సినిమాకు మహేష్ బాబు ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. ఉత్తరాదిన హరిద్వార్, ఉదయ్ పూర్, వారణాసి ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంది. ఈ భారీ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిందని స్వయంగా మహేష్ ప్రకటించాడు. అంతేకాదు…. సినిమాకు సంబంధించిన రెండు వర్కింగ్ స్టిల్స్ కూడా రిలీజ్ చేశాడు. హైదరాబాద్ కూడా చేరుకున్నట్టు ప్రకటించిన మహేష్ బాబు…. త్వరలోనే బ్రహ్మోత్సవానికి సంబంధించిన విడుదల తేదీల్ని వెల్లడించే అవకాశముంది. సినిమాలో […]

Advertisement
Update: 2016-03-16 21:18 GMT
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ప్రారంభించిన బ్రహ్మోత్సవం సినిమాకు మహేష్ బాబు ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. ఉత్తరాదిన హరిద్వార్, ఉదయ్ పూర్, వారణాసి ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంది. ఈ భారీ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిందని స్వయంగా మహేష్ ప్రకటించాడు. అంతేకాదు…. సినిమాకు సంబంధించిన రెండు వర్కింగ్ స్టిల్స్ కూడా రిలీజ్ చేశాడు. హైదరాబాద్ కూడా చేరుకున్నట్టు ప్రకటించిన మహేష్ బాబు…. త్వరలోనే బ్రహ్మోత్సవానికి సంబంధించిన విడుదల తేదీల్ని వెల్లడించే అవకాశముంది. సినిమాలో మహేష్ సరసన సమంత, కాజల్, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు. మిక్కీ జే మేయర్ స్వరాలు సమకూర్చిన ఈ సినిమాలోని పాటల్ని త్వరలోనే విడుదల చేయబోతున్నారు. ఏప్రిల్ 29న లేదా మే మొదటి వారంలో బ్రహ్మోత్సవం సినిమాను థియేటర్లలోకి తీసుకొచ్చే అవకాశముంది.
Click on Image to Read:
Tags:    
Advertisement

Similar News