వైసీపీకి బెజవాడ నేత రాజీనామా

వైసీపీకి వ్యాపారవేత్త కోనేరు రాజేంద్రప్రసాద్ రాజీనామా చేశారు. మొన్నటి ఎన్నికల్లో విజయవాడ ఎంపీ స్థానానికి వైసీపీ తరపున ఆయన పోటీచేశారు. అయితే టీడీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోవాలన్న ఉద్దేశంతోనే పార్టీకి రాజీనామా చేసినట్టు ఆయన ప్రకటించారు. ఎమార్ కేసులో కోనేరు కొద్దికాలం జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తనతో పాటు కేసుల్లో ఇబ్బందిపడ్డ కోనేరుకు జగన్‌ విజయవాడ ఎంపీ టికెట్ ఇచ్చారు. ఎంపీ స్థానం కోసం చాలా మంది పోటీ […]

Advertisement
Update: 2016-03-16 09:49 GMT

వైసీపీకి వ్యాపారవేత్త కోనేరు రాజేంద్రప్రసాద్ రాజీనామా చేశారు. మొన్నటి ఎన్నికల్లో విజయవాడ ఎంపీ స్థానానికి వైసీపీ తరపున ఆయన పోటీచేశారు. అయితే టీడీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోవాలన్న ఉద్దేశంతోనే పార్టీకి రాజీనామా చేసినట్టు ఆయన ప్రకటించారు. ఎమార్ కేసులో కోనేరు కొద్దికాలం జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తనతో పాటు కేసుల్లో ఇబ్బందిపడ్డ కోనేరుకు జగన్‌ విజయవాడ ఎంపీ టికెట్ ఇచ్చారు. ఎంపీ స్థానం కోసం చాలా మంది పోటీ పడ్డా చివరకు కోనేరుకే జగన్‌ టికెట్ ఇచ్చారు.

మొదట్లో పొట్లూరి కూడా ఎంపీ టికెట్ కోసం ట్రై చేసినట్టు వార్తలొచ్చాయి. కానీ జగన్‌ కోనేరు వైపే మొగ్గుచూపారు. ఆ కోపంతోనే పొట్లూరి వరప్రసాద్ టీడీపీ వైపు చూశారని చెబుతుంటారు. కానీ అక్కడ కూడా ఆయన నిరాశే ఎదురైంది. అయితే ఎన్నికలు ముగిసినప్పటి నుంచి కోనేరు పెద్దగా రాజకీయాల్లో చురుగ్గా ఉండడం లేదు. కోనేరు రాజీనామా వల్ల వైసీపీకి పెద్దగా ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు. పైగా విజయవాడ ఎంపీ అభ్యర్థిగా మరో బలమైన వ్యక్తిని ఎంపిక చేసుకునే వెసులుబాటు వైసీపీకి దక్కినట్టు అయింది. విజయవాడ ఎంపీ స్థానానికి రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇప్పటి నుంచే చాలా మంది పెద్దపెద్ద నేతలు పావులు కదుపుతున్నారు.

Click on Image to Read:

 

 

 

 

Tags:    
Advertisement

Similar News