జగన్‌కి పట్టని పార్టీ ఆవిర్భావ దినోత్సవం

ఈ నెల 12వ తేదీకి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ ఆవిర్భవించి ఐదేళ్లు పూర్తయింది. పార్టీ ఆరో సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా పార్టీ కేంద్రకార్యాలయం హైదరాబాద్‌లోను, జిల్లాల్లోను, నియోజకవర్గ కేంద్రాల్లోను, మండల కేంద్రాల్లోను పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు వైభవంగా జరుపుకున్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించారు. వైఎస్‌ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేశారు. పేదలకు బట్టలు పంచిపెట్టారు. ఆసుపత్రులలో రోగులకు పండ్లు అందజేయడం వంటి పలు సేవాకార్యక్రమాలు జరిపారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు, కార్యకర్తలు […]

Advertisement
Update: 2016-03-14 03:01 GMT

ఈ నెల 12వ తేదీకి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ ఆవిర్భవించి ఐదేళ్లు పూర్తయింది. పార్టీ ఆరో సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా పార్టీ కేంద్రకార్యాలయం హైదరాబాద్‌లోను, జిల్లాల్లోను, నియోజకవర్గ కేంద్రాల్లోను, మండల కేంద్రాల్లోను పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు వైభవంగా జరుపుకున్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించారు. వైఎస్‌ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేశారు. పేదలకు బట్టలు పంచిపెట్టారు. ఆసుపత్రులలో రోగులకు పండ్లు అందజేయడం వంటి పలు సేవాకార్యక్రమాలు జరిపారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కానీ పార్టీ అధినేత జగన్‌ మాత్రం ఈ వేడుకలకు దూరంగా వున్నారు. గత యేడాది కూడా ఆయన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్నట్టులేదు. ఆయన ఆవిర్భావ దినోత్సవంలో ఎందుకు పాల్గొనడం లేదు అనేది కార్యకర్తలకు అంతుపట్టని ప్రశ్న. మార్చి 12వ తేదీన ఆయన కూతురు పుట్టినరోజు. ఆ అమ్మాయి పుట్టినరోజు వేడుక జరిపించడానికి బెంగుళూరు వెళ్లినట్టు సమాచారం. పార్టీకూడా అంతే ముఖ్యమని ఆయన భావించి వుంటే ఉదయంపూట పార్టీ ఆవిర్భావ సభలో పాల్గొని, సాయంత్రం బెంగుళూరులో జరిగే కూతురు పుట్టినరోజు కార్యక్రమానికి హాజరు కావచ్చు. కానీ అలా జరగలేదు. బహుశా ఆయనకు పార్టీ కన్నా కూతురే ముఖ్యం అయి వుండవచ్చు. ఎవరి ఇష్టాలు వాళ్లవి..!

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News