సుబ్బరామిరెడ్డి హత్య వెనుక విజయ్ మాల్యా హస్తం?

బ్యాంకుల వద్ద 9 వేల కోట్లు అప్పుచేసి విదేశాలకు పారిపోయిన లిక్కర్ డాన్ విజయ్‌మాల్యాపై సీపీఐ నేత నారాయణ మండిపడ్డారు. మాల్యా విదేశాలకు పారిపోవడం వెనుక ప్రధాని మోదీ హస్తముందని ఆరోపించారు. అప్పు ఎగవేతదారుల జాబితా నుంచి విజయ్ మాల్యా పేరును మోదీనే తొలగించారని అలా చేయడం ద్వారా మాల్యా పారిపోయేందుకు అవకాశం కల్పించారని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం మాల్యాకు నారుపోస్తే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం నీరు పోస్తోందని మండిపడ్డారు. విజయ్‌ మాల్యాకు నెల్లూరు జిల్లాతోనూ సంబంధాలున్నాయన్నారు. […]

Advertisement
Update: 2016-03-12 22:26 GMT

బ్యాంకుల వద్ద 9 వేల కోట్లు అప్పుచేసి విదేశాలకు పారిపోయిన లిక్కర్ డాన్ విజయ్‌మాల్యాపై సీపీఐ నేత నారాయణ మండిపడ్డారు. మాల్యా విదేశాలకు పారిపోవడం వెనుక ప్రధాని మోదీ హస్తముందని ఆరోపించారు. అప్పు ఎగవేతదారుల జాబితా నుంచి విజయ్ మాల్యా పేరును మోదీనే తొలగించారని అలా చేయడం ద్వారా మాల్యా పారిపోయేందుకు అవకాశం కల్పించారని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం మాల్యాకు నారుపోస్తే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం నీరు పోస్తోందని మండిపడ్డారు. విజయ్‌ మాల్యాకు నెల్లూరు జిల్లాతోనూ సంబంధాలున్నాయన్నారు. మాజీ ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి హత్య వెనుక మాల్యా హస్తముందని నారాయణ ఆరోపించారు. లిక్కర్ బిజినెస్‌లో మాగుంట, మాల్యా మధ్య విభేదాలు వచ్చాయని అవే సుబ్బరామిరెడ్డి హత్యకు దారి తీశాయని అన్నారు. మాజీ ఎంపీ సుబ్బరామిరెడ్డి కూడా అప్పట్లో పేరుమోసిన లిక్కర్ వ్యాపారిగా ఉండేవారు. విద్యార్థులు రాజకీయాల్లోకి రావద్దంటూ కేంద్రమంత్రి వెంకయ్య చేసిన ప్రకటనను నారాయణ తీవ్రంగా తప్పుపట్టారు. వెంకయ్యనాయుడు రాజకీయాల్లోకి ఎలా వచ్చారో గుర్తు లేదా అని ప్రశ్నించారు. విద్యార్థి నాయకుడిగా ఆర్‌ఎస్‌ఎస్ నిక్కర్లు వేసుకుని వెంకయ్యనాయుడు తిరిగే వారని నారాయణ గుర్తు చేశారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News