కర్ణుడిలా ఉంటారా?... ఎదిగేందుకు ఎగిరిపోతారా?

ఎంతటి సమర్థవంతమైన రాజకీయ నాయకుడైనా సరే రాణించాలంటే ఒక మంచి వేదిక కావాలి.  వేదిక సరైనది కానప్పుడు… సదరు వేదికపై జనం ఆగ్రహంతో ఉన్నప్పుడు ఈ వేదిక మీద ఉన్న నాయకుడు ఎంతటి సమర్ధుడైనా రాణించడం కష్టం. ఇప్పుడు టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. తెలంగాణలో చురుకైనా, ప్రతిభ ఉన్న, ముఖ్యంగా నోరున్న నాయకుల్లో రేవంత్ రెడ్డి ముందు వరుసలో ఉంటారు. కానీ ఆయన టీడీపీలో ఉండడంతో పార్టీపైన ఉన్న […]

Advertisement
Update: 2016-03-10 01:40 GMT

ఎంతటి సమర్థవంతమైన రాజకీయ నాయకుడైనా సరే రాణించాలంటే ఒక మంచి వేదిక కావాలి. వేదిక సరైనది కానప్పుడు… సదరు వేదికపై జనం ఆగ్రహంతో ఉన్నప్పుడు ఈ వేదిక మీద ఉన్న నాయకుడు ఎంతటి సమర్ధుడైనా రాణించడం కష్టం. ఇప్పుడు టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. తెలంగాణలో చురుకైనా, ప్రతిభ ఉన్న, ముఖ్యంగా నోరున్న నాయకుల్లో రేవంత్ రెడ్డి ముందు వరుసలో ఉంటారు. కానీ ఆయన టీడీపీలో ఉండడంతో పార్టీపైన ఉన్న వ్యతిరేకత కూడా రేవంత్ మీద పడుతోంది.

ఇటీవల తెలంగాణలో టీడీపీకి ఎదురవుతున్న వరుస ఘోర ఓటమిలు చూసిన‌ తర్వాత నేతలంతా ఎవరిదారి వారు వెతుక్కుంటున్నారు. ఒక్క రేవంత్ మాత్రమే కష్టమైనా నష్టమైన టీడీపీతోనే అన్నట్టుగా మొండిగా వ్యవహరిస్తున్నారు. బీజేపీ కేంద్ర మంత్రి గంగారాం స్వయంగా వచ్చి కమలదండులో చేరాల్సిందిగా కోరినా రేవంత్ సున్నితంగానే తిరస్కరించారు. నిజంగానే ఒక కర్ణుడిలా చంద్రబాబు కోసం నిలబడ్డారు. ఆ విషయంలో రేవంత్‌ను ఎవరైనా మొచ్చుకోవాల్సిందే. కానీ ఈ స్నేహబంధంలో రేవంత్ తన రాజకీయ జీవితాన్నే ప్రశ్నార్థం చేసుకోవడం సరికాదేమో!.

తెలంగాణ గ్రామీణ ప్రాంతంల్లో టీఆర్‌ఎస్ బలంగా ఉన్నా, గ్రేటర్ హైదరాబాద్లో టీడీపీదే పైచేయి అనుకున్నారు. కానీ అక్కడ కూడా చరిత్ర ఎరుగని ఓటమి ఎదుర్కొంది టీడీపీ. వరంగల్ లోక్‌సభ, నారాయణఖేడ్ ఉప ఎన్నిక, వరంగల్, ఖమ్మ కార్పొరేషన్‌లో కూడా టీడీపీ డిపాజిట్టు పొగొట్టుకుంది. రేవంత్ సొంత జిల్లా మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట నగర పంచాయితీ ఎన్నికల్లోనూ టీడీపీ ఒక్క వార్డును కూడా గెలుచుకోలేకపోయింది. ఓట్ల శాతం కూడా మొన్నటి సాధారణ ఎన్నికలతో పోలిస్తే ఊహించని విధంగా టీడీపీకి తగ్గిపోయింది. ఎమ్మెల్యేలుగా టీటీడీపీలో మిగిలేది రేవంత్, సండ్ర మాత్రమే. సండ్ర రాజకీయంగా భారీగా ఏమీ ఆశించడం లేదు. రేవంత్ అవకాశం వస్తే స్టేట్‌నే ఏలాలనుకున్నారు. కానీ టీడీపీలో ఉంటే అది సాధ్యమేనా అన్నది వరుస ఓటమిలతో తలెత్తున్న అనుమానం.

నిత్యపతనం దిశగా టీడీపీ వెళ్తున్న ప్రస్తుత తరుణంలో కూడా మళ్లీ పార్టీ పుంజుకుంటుందని ఎదురు చూడడం రేవంత్ తన యవ్వనాన్ని వృథా చేసుకోవడమే అవుతుందన్న అభిప్రాయం ఉంది. వరంగల్ కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాలను అర్థం చేసుకుంటే రేవంత్‌కు ఒక మంచి మార్గమే ఉన్నట్టుగా అనిపిస్తోంది. వరంగల్ కార్పొరేషన్లో టీడీపీకి కేవలం 8 వేల945 ఓట్లు రాగా… బీజేపీకి ఏకంగా 48 వేల 513 ఓట్లు వచ్చాయి. ఈ ఓట్లు బట్టి చూస్తే తెలంగాణలో టీడీపీ కన్నా బీజేపీకే కాస్తోకూస్తో భవిష్యత్తు కనిపిస్తోంది. ఈ ఫలితాలను చూసిన తర్వాతైనా రేవంత్ పునరాలోచన చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బీజేపీ నుంచి ఎలాగో ఇప్పటికే ఆహ్వానం ఉంది కాబట్టి అటుగా ఆలోచిస్తే మంచిదే అంటున్నారు. చూడాలి రేవంత్ కర్ణుడిలాగే కలకాలం మిగిలిపోతారో… లేక ఎదిగేందుకు ఎగిరిపోతారో! గతంలో చంద్రబాబుకు నేను కర్ణుడిలాంటివాడినని రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పుకున్న విషయం తెలిసిందే.

Click on image to read:

 

 

Tags:    
Advertisement

Similar News