రైతుకు జస్ట్ ఆయింట్మెంట్ రాసిన చంద్రబాబు

రుణమాఫీ విషయంలో రైతులకు ఒకేసారి కాకుండా విడతల వారీగా షాక్ ఇస్తోంది ఏపీ ప్రభుత్వం. తాజాగా బడ్జెట్లో రైతు రుణమాఫీ కోసం కేటాయించిన మొత్తం చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. ఎన్నికల సమయంలో బేషరతుగా మొత్తం రుణాలను మాఫీ చేస్తామని చంద్రబాబు చెప్పారు.  ఆయన ఆ వాగ్దానం ఇవ్వడంతో రైతులు రుణాలు తిరిగి చెల్లించడం మానేశారు.  చంద్రబాబు అధికారం చేపట్టిన నాటికి రైతు రుణాల మొత్తం రూ. 87వేల 612 కోట్లు. ఈ రెండేళ్లలో వడ్డీ మరో […]

Advertisement
Update: 2016-03-10 04:23 GMT

రుణమాఫీ విషయంలో రైతులకు ఒకేసారి కాకుండా విడతల వారీగా షాక్ ఇస్తోంది ఏపీ ప్రభుత్వం. తాజాగా బడ్జెట్లో రైతు రుణమాఫీ కోసం కేటాయించిన మొత్తం చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. ఎన్నికల సమయంలో బేషరతుగా మొత్తం రుణాలను మాఫీ చేస్తామని చంద్రబాబు చెప్పారు. ఆయన ఆ వాగ్దానం ఇవ్వడంతో రైతులు రుణాలు తిరిగి చెల్లించడం మానేశారు.

చంద్రబాబు అధికారం చేపట్టిన నాటికి రైతు రుణాల మొత్తం రూ. 87వేల 612 కోట్లు. ఈ రెండేళ్లలో వడ్డీ మరో రూ. 24 వేల కోట్లు. అయితే ఎన్నికలకు ముందు అన్ని రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు… అధికారంలోకి రాగానే కోటయ్య కమిటీ వేసి ఇష్టానుసారం ఆంక్షలు విధించి రైతు రుణాల మొత్తాన్ని రూ. 35 వేల కోట్లకు కుదించింది.

ఆ మొత్తాన్ని కూడా నాలుగు విడుతల్లో చెల్లిస్తామని వంకపెట్టింది. అప్పటి నుంచే రైతు రుణ వ్యవస్థ కుప్పకూలింది. ఇప్పటి వరకు ప్రభుత్వం చెల్లించింది కేవలం రూ. 7400 కోట్లు మాత్రమే. తాజాగా బడ్జెట్‌లో రుణమాపీ కోసం కేవలం రూ. 3, 512 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. ఈ మొత్తం వడ్డీలకు కూడా సరిపోని పరిస్థితి. ఈ లెక్కన చూస్తే రైతులకు ప్రభుత్వం రుణవిముక్తి కల్పిస్తోందా లేక రుణ ఉచ్చును పన్నుతోందా అన్నది ఎవరికైనా అర్థమయ్యే విషయమే. ఆంక్షల అనంతరం తేలిన రుణమొత్తాన్ని నాలుగు విడతల్లో చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఎక్కడ 35 వేల కోట్లు ఎక్కడ మూడు వేల ఐదు వందల కోట్లు ఇలా అయితే మరో పదేళ్లు అయినా రైతులు అప్పు ఊబి నుంచి గట్టెక్కడం అసాధ్యమే.

Click on image to read:

Tags:    
Advertisement

Similar News