బిజేపీకీ కమ్యూనిస్టుల గతేనా?

ఆంధ్రప్రదేశ్‌లో వీలైనంత త్వరగా టీడీపీ పొత్తునుంచి బయటపడకపోతే బిజేపీ కూడా కమ్యూనిస్టు పార్టీలలాగా దెబ్బతింటుందని కొందరు బిజేపీ నాయకులు అమిత్‌షాతో చెప్పినట్టు తెలిసింది. టీడీపీ పార్టీ ఏర్పడకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కమ్యూనిస్టు పార్టీలు చాలా బలంగా ఉండేవి. ఒక దశలో కమ్యూనిస్టుపార్టీలు అధికారంలోకి వస్తాయనికూడా భావించారు. కొన్ని కారణాలవల్ల కమ్యూనిస్టులు అధికారంలోకి రాలేకపోయారు. టీడీపీ ఏర్పడ్డాక, టీడీపీతో పొత్తుపెట్టుకున్నాక అనేకమంది కమ్యూనిస్టు కార్యకర్తలు టీడీపీలోకి వలసపోయారు. టీడీపీతో పొత్తు తరువాత కమ్యూనిస్టుపార్టీలు చాలామంది కార్యకర్తలను కోల్పోయాయి. ఇప్పుడు […]

Advertisement
Update: 2016-03-09 01:24 GMT

ఆంధ్రప్రదేశ్‌లో వీలైనంత త్వరగా టీడీపీ పొత్తునుంచి బయటపడకపోతే బిజేపీ కూడా కమ్యూనిస్టు పార్టీలలాగా దెబ్బతింటుందని కొందరు బిజేపీ నాయకులు అమిత్‌షాతో చెప్పినట్టు తెలిసింది. టీడీపీ పార్టీ ఏర్పడకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కమ్యూనిస్టు పార్టీలు చాలా బలంగా ఉండేవి. ఒక దశలో కమ్యూనిస్టుపార్టీలు అధికారంలోకి వస్తాయనికూడా భావించారు. కొన్ని కారణాలవల్ల కమ్యూనిస్టులు అధికారంలోకి రాలేకపోయారు. టీడీపీ ఏర్పడ్డాక, టీడీపీతో పొత్తుపెట్టుకున్నాక అనేకమంది కమ్యూనిస్టు కార్యకర్తలు టీడీపీలోకి వలసపోయారు. టీడీపీతో పొత్తు తరువాత కమ్యూనిస్టుపార్టీలు చాలామంది కార్యకర్తలను కోల్పోయాయి.

ఇప్పుడు బిజేపీ కూడా టీడీపీతో పొత్తు కొనసాగిస్తే ఇదే పరిస్థితి దాపురిస్తుందని కొందరు బిజేపీ నాయకులు అంటున్నారు. రాజమండ్రి సభ తరువాత సోము వీర్రాజు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల నాటికి బిజేపీ స్వతంత్రంగా పోటీ చేస్తుందని అందుకు అనుగుణంగా పార్టీని, క్యాడర్‌ను సమాయత్తం చేస్తామని సోము వీర్రాజు చెప్పారు. కానీ బిజేపీ తరుపున ఎన్నికై టీడీపీ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేస్తున్న కామినేని శ్రీనివాస్‌ మాట్లాడుతూ బిజేపీ, టీడీపీ కలిసే వుంటాయని, కొందరు అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు.

బిజేపీ నాయకులే ఇలా మాట్లాడడం చూసిన కార్యకర్తలు, కొందరు బిజేపీ నాయకులు ఫిజికల్‌గా పార్టీలో వున్నా వాళ్ల ఆత్మమాత్రం టీడీపీలో వుందని, వాళ్లకు పార్టీ సిద్ధాంతాలకన్నా సామాజిక వర్గం ముఖ్యమని అంటూ కామినేని శ్రీనివాస్‌, వెంకయ్యనాయుడులపై అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు.

Click on image to read:

Tags:    
Advertisement

Similar News