ఎల్‌ఈడీ వెలుగుల వెనుక తంతుపై గళమెత్తిన జగన్

ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాలు ప్రశాంతంగా జరిగాయి. అయితే  ఎల్ఈడీ బల్బులు అమర్చే ప్రక్రియలో జరుగుతున్న అవకతవకలపై జగన్ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వాన్ని నిలదీశారు.  ఎల్‌ఈడీ బల్బులు అమర్చితే కరెంట్ ఆదా అవుతుందన్న విషయం తమకూ తెలుసని… కానీ బల్బులు అమర్చేందుకు టెండర్లు పిలిచారా లేదా అని ప్రశ్నించారు. కానీ టెండర్లు పిలువలేదని కేంద్ర ప్రభుత్వ సంస్థకు ఆ పనిని అప్పగించామని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పడంతో జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్ర […]

Advertisement
Update: 2016-03-07 23:17 GMT

ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాలు ప్రశాంతంగా జరిగాయి. అయితే ఎల్ఈడీ బల్బులు అమర్చే ప్రక్రియలో జరుగుతున్న అవకతవకలపై జగన్ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎల్‌ఈడీ బల్బులు అమర్చితే కరెంట్ ఆదా అవుతుందన్న విషయం తమకూ తెలుసని… కానీ బల్బులు అమర్చేందుకు టెండర్లు పిలిచారా లేదా అని ప్రశ్నించారు. కానీ టెండర్లు పిలువలేదని కేంద్ర ప్రభుత్వ సంస్థకు ఆ పనిని అప్పగించామని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పడంతో జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

కేంద్ర ప్రభుత్వ సంస్థల పేర్లు చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భారీ కుంభకోణాలకు పాల్పడుతోందని ఆరోపించారు. జెన్‌ కో విద్యుత్ కొనుగోళ్ల విషయంలో బీహెచ్‌ఈఎల్‌ను అడ్డుపెట్టి భారీగా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. పక్కనే ఉన్న తెలంగాణ ప్రభుత్వం తక్కువ ధరకు కరెంట్ కొంటుంటే ఏపీ మాత్రం ఎక్కడా లేని ధరకు విద్యుత్ కొనుగోలు చేయడం వెనుక కుంభకోణం నిజం కాదా అని ప్రశ్నించారు. బొగ్గు రేటు భారీగా తగ్గినా ఇంకా పాత రేట్లకే ఎందుకు కొంటున్నారని ప్రశ్నించారు. పారిశ్రామికవేత్తలకు మేలు చేసేందుకు ప్రభుత్వం ఈ విధంగా ప్రయత్నిస్తోందన్నారు.

అయితే జగన్ వ్యాఖ్యలకు ఎప్పటిలాగే అచ్చెన్నాయుడు ఎదురుదాడి చేశారు. దోపిడిపై మాట్లాడే హక్కు జగన్‌కు లేదని అచ్చెన్న చెప్పారు. దోపిడి గురించి జగన్ మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉందన్నారు. మరోరూపంలో వస్తే ఈ అంశంపై చర్చించేందుకు సిద్ధమని ప్రకటించారు. ఇంతలో జోక్యం చేసుకున్న స్పీకర్ ఈ అంశాన్ని ఇంతటితో ముగిస్తున్నట్టు చెప్పి తదుపరి ప్రశ్నకు వెళ్లిపోయారు.

Click on image to read:

Tags:    
Advertisement

Similar News