సంజయ్ దత్ కోసం కథలు సిద్ధం

దశాబ్దాల ఉత్కంఠ తర్వాత సంజయ్ దత్ జైలు నుంచి విడుదలయ్యాడు. ఇకపై అతడికి కోర్టు కేసులుండవు, వాయిదాలుండవు, జైలుకెళ్లడాలుండవు. తనకు స్వేచ్ఛ లభించిన విషయాన్ని సంజయ్ దత్తే జీర్ణించుకోలేకపోతున్నాడు. ప్రస్తుతం తను ఫ్రీ బర్డ్ అనే విషయాన్ని అవగతం చేసుకోవడానికి ఇంకొన్ని రోజులు పడుతుందని కూడా ప్రకటించాడు. జైలు నుంచి సంజూ బాబా విడుదలవ్వడంతో… అతడి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. సంజూ మరోసారి వెండితెరపై మెరిసిపోతాడని భావిస్తున్నారు. ఇందుకు తగ్గట్టే అతడితో సినిమాలు చేసేందుకు దర్శకులు కూడా […]

Advertisement
Update: 2016-02-26 01:56 GMT
దశాబ్దాల ఉత్కంఠ తర్వాత సంజయ్ దత్ జైలు నుంచి విడుదలయ్యాడు. ఇకపై అతడికి కోర్టు కేసులుండవు, వాయిదాలుండవు, జైలుకెళ్లడాలుండవు. తనకు స్వేచ్ఛ లభించిన విషయాన్ని సంజయ్ దత్తే జీర్ణించుకోలేకపోతున్నాడు. ప్రస్తుతం తను ఫ్రీ బర్డ్ అనే విషయాన్ని అవగతం చేసుకోవడానికి ఇంకొన్ని రోజులు పడుతుందని కూడా ప్రకటించాడు. జైలు నుంచి సంజూ బాబా విడుదలవ్వడంతో… అతడి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. సంజూ మరోసారి వెండితెరపై మెరిసిపోతాడని భావిస్తున్నారు. ఇందుకు తగ్గట్టే అతడితో సినిమాలు చేసేందుకు దర్శకులు కూడా సిద్ధమవుతున్నారు. వీళ్లలో ముందువరుసలో ఉన్నాడు రాజ్ కుమార్ హిరాణి. తన సినిమాలతో సంచలనాలు సృష్టించే హిరాణి… సంజయ్ దత్ తో మున్నాభాయ్ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడు. త్వరలోనే దీనిపై ఎనౌన్స్ మెంట్ ఉంటుంది. మరోవైపు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా సంజయ్ దత్ కోసం ఓ కథ సిద్ధం చేసే పనిలో ఉన్నాడు. ఈ రెండు సినిమాలకు సంజయ్ దత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశముంది.
Click on Image to Read:
Tags:    
Advertisement

Similar News