మరో ఏడాది పాటు గుండెలు బండలు చేసుకోవాల్సిందే!

వైసీపీ ఎమ్మెల్యేలపై ఆపరేషన్ ఆకర్ష్ మంత్రాన్ని టీడీపీ ప్రయోగిస్తోంది.  ప్రజా సమస్యలపై కన్నా ఎమ్మెల్యేల ఫిరాయింపులపైనే పెద్దలు అధికంగా ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. టీడీపీ వారికి ఈ పరిణామం ఆనందాన్ని కలిగిస్తోంది. అదే సమయంలో వైసీపీ శ్రేణులను కాసింత కలవరపాటుకు గురి చేస్తోంది. అయితే వైసీపీ, జగన్ స్టామినాకు ఇది కూడా ఒక పరీక్ష లాంటిదే. పార్టీ పెట్టినప్పటి నుంచి అనేక సవాళ్లను అధిగమిస్తూ వచ్చిన జగన్‌ ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల గండాన్ని కూడా ఆధిగమించాల్సింది ఉంది.. సాధారణంగా […]

Advertisement
Update: 2016-02-26 01:50 GMT

వైసీపీ ఎమ్మెల్యేలపై ఆపరేషన్ ఆకర్ష్ మంత్రాన్ని టీడీపీ ప్రయోగిస్తోంది. ప్రజా సమస్యలపై కన్నా ఎమ్మెల్యేల ఫిరాయింపులపైనే పెద్దలు అధికంగా ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. టీడీపీ వారికి ఈ పరిణామం ఆనందాన్ని కలిగిస్తోంది. అదే సమయంలో వైసీపీ శ్రేణులను కాసింత కలవరపాటుకు గురి చేస్తోంది. అయితే వైసీపీ, జగన్ స్టామినాకు ఇది కూడా ఒక పరీక్ష లాంటిదే. పార్టీ పెట్టినప్పటి నుంచి అనేక సవాళ్లను అధిగమిస్తూ వచ్చిన జగన్‌ ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల గండాన్ని కూడా ఆధిగమించాల్సింది ఉంది..

సాధారణంగా కొత్తవారిని పార్టీలోకి తీసుకుంటే పాత వారు వ్యతిరేకిస్తారు. టీడీపీలో అది జరిగినా ఇంకా మూడేళ్లు అధికారం ఉండడంతో చంద్రబాబు నిర్ణయాన్ని ఎవరూ ధిక్కరించే సాహసం చేయడం లేదు. ఇప్పటికే ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీని వీడగా… మరికొందరు ఆ మార్గంలో ప్రయాణించినా ఆశ్చర్యం లేదన్న భావన ఉంది. అయితే ఈ వలసల రాజకీయం మరో ఏడాది మాత్రమే సాగుతుందని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. చంద్రబాబు పదవీకాలం మూడేళ్లు పూర్తి చేసుకుంటే అప్పటి నుంచి టీడీపీకి రివర్స్‌ ఆకర్ష్ మొదలవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నుంచి ఎమ్మెల్యేలను తీసుకోవడం ద్వారా చంద్రబాబు పార్టీ అనే బెలూన్‌లోకి అధిక మోతాదులో గాలి ఊదుకుంటున్నారని ఒక స్థాయికి వెళ్లిన తర్వాత అది పేలడం ఖాయమంటున్నారు.

తమ పార్టీ మాత్రం మరో ఏడాది పాటు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు మానసికంగా సిద్ధంగా ఉండాల్సిందే అంటున్నారు. ఒక వేళ చంద్రబాబు అధికమొత్తంలో ఎమ్మెల్యేలను తీసుకెళ్లినా వచ్చే నష్టమేమీ లేదంటున్నారు. వైసీపీకి జగనే ముఖచిత్రమని… ఆయన్ను చూసి జనం ఓటేస్తారే గానీ డబ్బులకు అమ్ముడుపోయే నేతలు ఉన్నాపోయినా ఒకేటేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సీబీఐ కలిసి జగన్‌ మీద దాడి చేసినా పార్టీని కాపాడుకుంటూ ముందుకు సాగారని… ఇప్పుడు చంద్రబాబు డబ్బులు ఎరచూపి ఎమ్మెల్యేలను కొనుక్కునంత మాత్రాన వైసీపీ భవిష్యత్తుకు వచ్చిన నష్టమేమీ లేదంటున్నారు. ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొన్న వైసీపీకి ఇది ఇక సమస్యే కాదని కొందరు నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పరోక్షంగా పార్టీ శ్రేణులకు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై ధైర్యం నూరిపోస్తున్నారు. మరో ఏడాది గుండె ధైర్యంతో ముందుకెళ్తే, ఎన్నికలు సమీపిస్తే అప్పుడు ఏ పార్టీ సత్తా ఎంతో తెలిసిపోతుందంటున్నారు.

Click on image to read:

Tags:    
Advertisement

Similar News