అబద్ధపు హామీలివ్వడంలో మోడీ, బాబు పోటీపడుతున్నారు

ఎన్డీయే మళ్లీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌లో మహారాష్ట్ర పరిణామాలు చోటుచేసుకుంటాయని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు.

Advertisement
Update: 2024-05-10 04:50 GMT

అబద్ధపు హామీలు ఇవ్వడంలో ప్రధాని నరేంద్ర మోడీ, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పోటీ పడుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ, బాబు.. ఇద్దరూ దొంగలేనన ఆయన ధ్వజమెత్తారు. తిరుపతిలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు ఇద్దరూ ప్రజాస్వామ్యాన్ని లూటీ చేసే దొంగలేనని నారాయణ విమర్శించారు. ఎన్డీయే మళ్లీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌లో మహారాష్ట్ర పరిణామాలు చోటుచేసుకుంటాయని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. ఓటమి భయంతోనే నరేంద్ర మోడీ మైండ్‌ గేమ్‌ ఆడుతున్నాడని, దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడని ఆయన మండిపడ్డారు.

ప్రస్తుతం మోడీ అయోధ్య రాముడిని వదిలి, మంగళసూత్ర రాజకీయాలకు తెరతీశాడని నారాయణ విమర్శించారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగాన్ని మార్చడానికి బీజేపీ కుట్ర చేస్తోందని ఈ సందర్భంగా ఆయన ప్రజలను హెచ్చరించారు. బీజేపీ పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ తన మేనిఫెస్టో అమలు చేయలేదని ఆయన గుర్తుచేశారు. ఎన్డీయే అధికారంలోకి వస్తే ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేయడం ఖాయమని స్పష్టం చేశారు.

Tags:    
Advertisement

Similar News