చంద్ర‌బాబుకు పొంచి ఉన్న వెన్నుపోటు?

వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు టీడీపీ చేర‌డం ఆ పార్టీ శ్రేణుల‌కు తెగ ఉత్సాహాన్ని ఇస్తోంది. తెలంగాణలో పార్టీ నామ‌రూపాల్లేకుండా పోయిందే అన్న బాధ‌కు ఏపీలో వ‌ల‌స‌లు అయింట్‌మెంట్‌గా ఉప‌యోగ‌ప‌డుతోంది. అయితే రాజ‌కీయాల‌పై కాసింత అవ‌గాహ‌న ఉన్న‌వారు… భ‌విష్య‌త్తును అంచ‌నా వేయ‌గ‌లిగిన టీడీపీ నేత‌లు మాత్రం జ‌రుగుతున్న దానిపై ఏమంత సంతోషంగా లేరని చెబుతున్నారు. భూమా రాక‌ను శిల్పామోహ‌న్ రెడ్డి, ఆదినారాయ‌ణ‌రెడ్డి రాక‌ను రామ‌సుబ్బారెడ్డి తీవ్రంగా వ్య‌తిరేకించారు. నేత‌లు పార్టీలో చేరే ఘ‌డియ‌కు గంట ముందు కూడా మీడియా ముందుకొచ్చి […]

Advertisement
Update: 2016-02-23 07:07 GMT

వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు టీడీపీ చేర‌డం ఆ పార్టీ శ్రేణుల‌కు తెగ ఉత్సాహాన్ని ఇస్తోంది. తెలంగాణలో పార్టీ నామ‌రూపాల్లేకుండా పోయిందే అన్న బాధ‌కు ఏపీలో వ‌ల‌స‌లు అయింట్‌మెంట్‌గా ఉప‌యోగ‌ప‌డుతోంది. అయితే రాజ‌కీయాల‌పై కాసింత అవ‌గాహ‌న ఉన్న‌వారు… భ‌విష్య‌త్తును అంచ‌నా వేయ‌గ‌లిగిన టీడీపీ నేత‌లు మాత్రం జ‌రుగుతున్న దానిపై ఏమంత సంతోషంగా లేరని చెబుతున్నారు.

భూమా రాక‌ను శిల్పామోహ‌న్ రెడ్డి, ఆదినారాయ‌ణ‌రెడ్డి రాక‌ను రామ‌సుబ్బారెడ్డి తీవ్రంగా వ్య‌తిరేకించారు. నేత‌లు పార్టీలో చేరే ఘ‌డియ‌కు గంట ముందు కూడా మీడియా ముందుకొచ్చి మ‌రీ వారి వ్య‌తిరేక‌త‌ను ప్ర‌క‌టించారు. కానీ ఆఖ‌రికి మాత్రం చంద్ర‌బాబుపై గౌర‌వంతో స‌ర్దుకుపోయేందుకు సిద్ధ‌ప‌డ్డామన్నారు. కానీ కొంద‌రు టీడీపీ సీనియ‌ర్ నేత‌లు మాత్రం ఈ స‌ర్దుకుపోయేత‌త్వంపై అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు.

ఆదినారాయ‌ణ‌రెడ్డి, రామ‌సుబ్బారెడ్డి…. శిల్పామోహ‌న్ రెడ్డి, భూమానాగిరెడ్డి ఒకే పార్టీలో ఉండ‌డం అంటే ఉప్పునిప్పు ఒకే చోట ఉండ‌డ‌మే అంటున్నారు. అయితే టీడీపీ అధికారం మ‌రో మూడేళ్లు ఉంది కాబ‌ట్టి ఈ స‌మ‌యంలో చంద్ర‌బాబు నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకించినా వ‌చ్చే లాభం క‌న్నా నష్ట‌మే వంద‌ల రెట్లు ఎక్కువ‌గా ఉంటుంద‌న్న ఉద్దేశంతోనే రామ‌సుబ్బారెడ్డి, శిల్సా సోద‌రులు ప్రస్తుతానికి అంగీకారం తెలిపి ఉంటారని భావిస్తున్నారు.

వీరు ఇప్పుడు చంద్ర‌బాబు నిర్ణ‌యాన్ని స‌మ‌ర్థించినా ఎన్నిక‌లు మ‌రో ఏడాది, ఆరు నెల‌లు ఉండ‌గా అస‌లు రూపం చూపిస్తార‌ని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. త‌ప్ప‌కుండా వీరు వైసీపీలోకో… లేక మ‌రో పార్టీలోకో జంప్ చేసినా ఆశ్చ‌ర్యం లేదంటున్నారు. వ‌ల‌స‌ల ద్వారా వైసీపీని బ‌ల‌హీన‌పర‌చాల‌న్న చంద్ర‌బాబు ఆలోచ‌న స‌రైన‌దే అయినా అందుకు ఎంచుకున్న ఎమ్మెల్యేలు స‌రైన వారు కాదని ఆ పార్టీనేతలు అంటున్నారు. బ‌ద్ధ‌శ‌త్రుత్వం, ఫ్యాక్ష‌న్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఎమ్మెల్యేల‌కు వ‌ల వేయ‌డం ద్వారా ఇప్ప‌టికే పార్టీలో ఉన్న వారి నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ‌స్తోందంటున్నారు. ప్ర‌స్తుతానికి అంద‌రూ స‌ర్దుకుపోయిన‌ట్టు క‌నిపిస్తున్నా ఎన్నిక‌ల వ‌ర‌కు ఆగి చంద్రబాబుకు ఏదో ఒక వ‌ర్గం వెన్నుపోటుపొడ‌వ‌డం ఖాయమని అంచనా వేస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో చంద్రబాబు జాగ్రత్తగా ఎప్పటికప్పుడు పరిస్థితిని చక్కదిద్దుతూ ముందుకెళ్లాలని కోరుతున్నారు.

Click on image to read:

Tags:    
Advertisement

Similar News