ఆ ముక్కురాయికి ఇంత సీన్ అవ‌స‌ర‌మా ?

తుమ్మితే రాలిపోయే ముక్కురాయిని పెట్టుకుని తిరగడం సాధ్యమేనా?. అలాంటి ముక్కురాయి వల్ల వచ్చే అందం కన్నా కలిగే చికాకే ఎక్కువ. ఇప్పుడు భూమానాగిరెడ్డి విషయంలోనూ ఇలాంటి అభిప్రాయమే వ్యక్తమవుతోంది. భూమా పార్టీ మారుతున్నారని టీవీల్లో వార్తలు రాబట్టి మూడు రోజులవుతోంది. కానీ ఇప్పటి వరకు మీడియా ముందుకు నేరుగా వచ్చి సూటిగా తాను పార్టీ మారటం లేదని భూమా చెప్పలేదు.  పైగా దోబూచులాట ఒకటి. ఇండియా, పాకిస్తాన్ మధ్య యుద్ధం మొదలవుతోందన్న స్థాయిలో మీడియాలో బిల్డప్ ఒకటి. ఇదే […]

Advertisement
Update: 2016-02-21 00:58 GMT

తుమ్మితే రాలిపోయే ముక్కురాయిని పెట్టుకుని తిరగడం సాధ్యమేనా?. అలాంటి ముక్కురాయి వల్ల వచ్చే అందం కన్నా కలిగే చికాకే ఎక్కువ. ఇప్పుడు భూమానాగిరెడ్డి విషయంలోనూ ఇలాంటి అభిప్రాయమే వ్యక్తమవుతోంది. భూమా పార్టీ మారుతున్నారని టీవీల్లో వార్తలు రాబట్టి మూడు రోజులవుతోంది. కానీ ఇప్పటి వరకు మీడియా ముందుకు నేరుగా వచ్చి సూటిగా తాను పార్టీ మారటం లేదని భూమా చెప్పలేదు. పైగా దోబూచులాట ఒకటి. ఇండియా, పాకిస్తాన్ మధ్య యుద్ధం మొదలవుతోందన్న స్థాయిలో మీడియాలో బిల్డప్ ఒకటి. ఇదే వైసీపీ శ్రేణులకు భూమా విషయంలో మండేలా చేస్తోంది.

భూమాకు చాలా గౌరవం ఇచ్చి వైసీపీ నుంచి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు. వయసులో పెద్దవాళ్లయిన వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి నేరుగా భూమా ఇంటికే వెళ్లి చర్చలు జరిపారు. పార్టీని వీడవద్దని విజ్ఞప్తి చేశారు.. భూమానాగిరెడ్డికి ఏమాత్రం ఇది ఉన్నా వెంటనే అటుఇటో తేల్చేసేవారు. ముగ్గురు కీలక నేతలతో చర్చల తర్వాత మనసు మార్చుకుని ఉంటే భూమా ఆ విషయం మీడియాకు చెప్పాలి .కానీ అలా చేయలేదు. పైగా వైసీపీ అభిమానులకు మండేలా టీడీపీ అనుకూల మీడియాకు పీలర్స్ వదలుతున్నారు. ఇక్కడే వైసీపీ శ్రేణులకు మండింది.

ఉంటారో వెళ్తారో చెప్పకుండా దాగుడుమూతలు ఆడే వ్యక్తి కోసం ఇంత సీన్ చేయడం అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. అసలు శోభానాగిరెడ్డి లేకుంటే నాగిరెడ్డి బలమెంతో కర్నూలు జిల్లాకు వెళ్లి అడిగితే చెబుతారంటున్నారు. అసలు భూమా వెళ్లిపోతే వైసీపీకి వచ్చే నష్టమేమిటని ప్రశ్నిస్తున్నారు. నిజంగా భూమాకు అంత సినిమాయే ఉండిఉంటే 2014కు ముందు వరుసగా ఎందుకు ఓడిపోయారని ప్రశ్నిస్తున్నారు. ఇలా తుమ్మితే రాలిపోయే ముక్కురాళ్ల బెదిరింపులకు భయపడుతూ బతకాల్సిన అవసరం వైసీపీ లేదంటున్నారు. పైగా ఒక డీఎస్పీని ”డోన్ట్ టచ్ మీ” అన్నందుకు ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించి జైలుకు పంపిన చంద్రబాబుపై కృతజ్ఞత చూపే నేతలు పార్టీకి అవసరమా అని ప్రశ్నిస్తున్నారు.

మూడు రోజులుగా టీడీపీ అనుకూల మీడియా ఇష్టానుసారం కథనాలు రాస్తున్న కనీసం ఖండించలేని వ్యక్తిని వదిలించుకోవడమే బెటర్ అని సగటు వైసీపీ అభిమానులు కూడా అభిప్రాయపడుతున్నారు. అయినా జగన్ రాజకీయ ప్రస్తానం వంద నుంచి మొదలుకాలేదని… ఒక ఎమ్మెల్యేతోనే మొదలైందని గుర్తు చేస్తున్నారు. అవకాశవాదుల మీద ఆధారపడి బతకాల్సిన అవసరం టీడీపీకి ఉందేమోగానీ వైసీపీకి లేదంటున్నారు. ప్రభుత్వం పెట్టే కేసులకు, వేధింపులకు భూమా లొంగుతున్నారు కాబోలు అన్న వాదనపైనా వైసీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. కేసులకు వేధింపులకు భయపడే వ్యక్తి ఇక కర్నూలు జిల్లా రాజకీయాల్లో ఏం సాధించగలరని ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద భూమా, టీడీపీ అనుకూల మీడియా కలిసి నాటకాలు ఆడుతున్నారన్న అభిప్రాయం వైసీపీ శ్రేణుల్లో బలంగా ఉంది.

Click on image to read:

Tags:    
Advertisement

Similar News