ఒకే సినిమాకు రెండు ఆడియో ఫంక్షన్లు

సాధారణంగా తన సినిమాల ఆడియో ఫంక్షన్లకు హాజరవ్వడానికి పవన్ ఇష్టపడడు. అలాంటిది ఒకే సినిమాకు సంబంధించి రెండు ఆడియో వేడుకలు నిర్వహించడానికి సిద్ధమౌతున్నాడట. రాష్ట్ర విభజన తర్వాత పవన్ సోలోగా నటించిన భారీ చిత్రం ఇదే కావడంతో…. కేవలం ఏపీకో, లేక తెలంగాణకో పరిమితం కాకుండా…. రెండు రాష్ట్రాల్లో భారీ ఆడియో ఫంక్షన్లు పెట్టాలని నిర్ణయించాడట. ఒక్కో ఫంక్షన్ కు దాదాపు లక్ష మంది పట్టేలా రెండు రాష్ట్రాల్లో రెండు వేదికలు సిద్ధం చేయాలని ఇప్పటికే ఆదేశాలు […]

Advertisement
Update: 2016-02-20 02:25 GMT
సాధారణంగా తన సినిమాల ఆడియో ఫంక్షన్లకు హాజరవ్వడానికి పవన్ ఇష్టపడడు. అలాంటిది ఒకే సినిమాకు సంబంధించి రెండు ఆడియో వేడుకలు నిర్వహించడానికి సిద్ధమౌతున్నాడట. రాష్ట్ర విభజన తర్వాత పవన్ సోలోగా నటించిన భారీ చిత్రం ఇదే కావడంతో…. కేవలం ఏపీకో, లేక తెలంగాణకో పరిమితం కాకుండా…. రెండు రాష్ట్రాల్లో భారీ ఆడియో ఫంక్షన్లు పెట్టాలని నిర్ణయించాడట. ఒక్కో ఫంక్షన్ కు దాదాపు లక్ష మంది పట్టేలా రెండు రాష్ట్రాల్లో రెండు వేదికలు సిద్ధం చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీచేశాడట పవన్. కేవలం సినిమాలే కాకుండా… పొలిటికల్ గా కూడా పాపులర్ అయ్యేందుకు పవన్ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. అందుకే తన సినిమా ఆడియో ఫంక్షన్ ను రెండు విధాలుగా ఉపయోగించుకునేందుకు ఇలా రెండు ఫంక్షన్లు పెట్టాడని అంటున్నారు. సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో వేడుక సందర్భంగా…. తాజా రాజకీయ పరిణామాలపై కూడా పవన్ మాట్లాడే అవకాశం ఉంది.

Click on image for Nikki Garlrani latest Stills

Tags:    
Advertisement

Similar News