బాహుబలిని బ్రేక్ చేసిన ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్… బాహుబలి రికార్డును బ్రేక్ చేశాడు. అయితే తన తాజా సినిమా నాన్నకు ప్రేమతో మాత్రం కాదు. ఇప్పుడిప్పుడే సెట్స్ పైకి వస్తున్న జనతా గ్యారేజీ సినిమాతో బాహుబలిని క్రాస్ చేశాడు. కేరళలో ఈ రికార్డు సెట్ అయింది. ఆ రాష్ట్రంలో బాహుబలి సినిమాను 3కోట్ల పాతిక లక్షలకు అప్పట్లో అమ్మేశారు. ఇప్పటివరకు కేరళలో తెలుగు స్టామినా అంతే. కానీ ఇప్పుడు జనతా గ్యారేజీ సినిమాతో ఆ మార్క్ దాటేశాడు ఎన్టీఆర్. అవును… ఈ […]

Advertisement
Update: 2016-02-19 23:12 GMT
యంగ్ టైగర్ ఎన్టీఆర్… బాహుబలి రికార్డును బ్రేక్ చేశాడు. అయితే తన తాజా సినిమా నాన్నకు ప్రేమతో మాత్రం కాదు. ఇప్పుడిప్పుడే సెట్స్ పైకి వస్తున్న జనతా గ్యారేజీ సినిమాతో బాహుబలిని క్రాస్ చేశాడు. కేరళలో ఈ రికార్డు సెట్ అయింది. ఆ రాష్ట్రంలో బాహుబలి సినిమాను 3కోట్ల పాతిక లక్షలకు అప్పట్లో అమ్మేశారు. ఇప్పటివరకు కేరళలో తెలుగు స్టామినా అంతే. కానీ ఇప్పుడు జనతా గ్యారేజీ సినిమాతో ఆ మార్క్ దాటేశాడు ఎన్టీఆర్. అవును… ఈ సినిమా కేరళ హక్కుల్ని ఓ నిర్మాత… ఏకంగా 4 కోట్ల రూపాయలు చెల్లించి దక్కించుకున్నాడని తెలుస్తోంది. ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాకూ కేరళలో ఇంత మార్కెట్ పలకలేదు. దీని వెనక ఓ కారణం కూడా ఉంది. జనతా గ్యారేజీలో మోహన్ లాల్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇదే సినిమాలో ఉన్ని ముకుందన్ విలన్ గా కూడా నటిస్తున్నాడు. వీళ్లిద్దరే కాకుండా… నిత్యామీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇలా ముగ్గురు మళయాలీ ప్రముఖులు జనతా గ్యారేజీలో ఉండడంతో…. ఆ మూవీ కేరళ రైట్స్ కు డిమాండ్ పెరిగింది.

Click on Image to Read:

Click on image for Nikki Garlrani latest Stills

Tags:    
Advertisement

Similar News