ర‌జ‌నీకాంత్ నెక్ట్స్ ఫిల్మ్ శివ‌లింగా...?

ప్ర‌స్తుతం సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ రెండు చిత్రాల‌తో బిజీగా వున్నారు. రంజిత్ డైరెక్ష‌న్ లో కబాలి చిత్రం చేస్తుండ‌గా ..ద‌ర్శ‌కుడు శంక‌ర్ తో రోబో 2.0 సినిమా చేస్తున్నారు. అయితే ప్ర‌స్తుతం కబాలి సినిమా షూటింగ్ పూర్తి అయ్యిన‌ట్లు తెలుస్తుంది. డ‌బ్బింగ్ వ‌ర్క్ ..కొన్ని ప్యాచ్ వ‌ర్క్ లు మిన‌హా క‌బాలి చిత్ర షూటింగ్ పూర్తి అయిన‌ట్లు గా తెలుస్తుంది. దీంతో వెంట‌నే రోబో 2.0 టీమ్ తో జాయిన్ అయిన‌ట్లు కూడా కోలీవుడ్ స‌మాచారం. ఈ సినిమా […]

Advertisement
Update: 2016-02-19 07:15 GMT

ప్ర‌స్తుతం సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ రెండు చిత్రాల‌తో బిజీగా వున్నారు. రంజిత్ డైరెక్ష‌న్ లో కబాలి చిత్రం చేస్తుండ‌గా ..ద‌ర్శ‌కుడు శంక‌ర్ తో రోబో 2.0 సినిమా చేస్తున్నారు. అయితే ప్ర‌స్తుతం కబాలి సినిమా షూటింగ్ పూర్తి అయ్యిన‌ట్లు తెలుస్తుంది. డ‌బ్బింగ్ వ‌ర్క్ ..కొన్ని ప్యాచ్ వ‌ర్క్ లు మిన‌హా క‌బాలి చిత్ర షూటింగ్ పూర్తి అయిన‌ట్లు గా తెలుస్తుంది. దీంతో వెంట‌నే రోబో 2.0 టీమ్ తో జాయిన్ అయిన‌ట్లు కూడా కోలీవుడ్ స‌మాచారం. ఈ సినిమా కోసం వ‌చ్చే ఏడాది ప్ర‌థ‌మార్ధం వ‌ర‌కు డేట్స్ ఇచ్చిన‌ట్లు కూడా తెలుస్తుంది.

అయితే ఈ రెండు చిత్రాల త‌రువాత ర‌జ‌నీకాంత్ చేయ‌బోయే చిత్రం క‌న్ఫమ్ అయ్యిందా అంటే ..అవున‌నే మాట వినిపిస్తుంది. క‌న్న‌డంలో తెర‌కెక్కిన శివ‌లింగ చిత్రం ను త‌మిళ లో రీమేక్ చేయ‌డానికి స‌న్నాహాలు చేసుకుంటున్నార‌నే టాక్ వుంది. దీంతో పాటు.. మ‌ల‌యాళ ద‌ర్శ‌కుడు సిద్దికి చెప్పిన ఒక క‌థ న‌చ్చి 2017 అక్టోబ‌ర్ నుంచి సినిమా చేయ‌డానికి డేట్స్ ఇచ్చిన‌ట్లు ర‌జనీ క్యాంప్ నుంచి న్యూస్ వినిపిస్తుంది. మ‌రి అస‌లు ఏమి చేయ‌బోతున్నాడు అనేది తెలియాలంటే అధికారికంగా ర‌జ‌నీకాంత్ ఆఫీస్ నుంచి ఒక ప్ర‌క‌ట‌న రావాల్సిందే మ‌రి.

Click on Image to Read:

Click on image for Nikki Garlrani latest Stills

Tags:    
Advertisement

Similar News