బాబు గాయానికి ఈనాడు పవర్‌ఫుల్‌ ఆయింట్‌మెంట్‌

టీడీపీ మీద ఈగ వాలినా దాని అనుకూల మీడియా సంస్థలు తట్టుకునేలా కనిపించడం లేదు. టీటీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావు టీఆర్‌ఎస్‌లో చేరడంతో ఆ పార్టీ శ్రేణులు అటు తెలంగాణ, ఇటు ఏపీలో ఉలిక్కిపడ్డాయి. టీటీడీఎల్పీ నేత పార్టీ మారడం ఏమిటని కంగారుపడుతున్నాయి. ఎర్రబెల్లి చేరిక రాత్రి వేళలో జరగడంతో ఉదయం లేవగానే పత్రికల్లో ఈ వార్తను చూసి టీడీపీ శ్రేణులు ఎక్కడ షాక్ అవుతాయనుకుందో ఏమో గానీ ఈనాడు పత్రిక అందుకు విరుగుడుగా ఒక కథనం […]

Advertisement
Update: 2016-02-10 23:05 GMT

టీడీపీ మీద ఈగ వాలినా దాని అనుకూల మీడియా సంస్థలు తట్టుకునేలా కనిపించడం లేదు. టీటీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావు టీఆర్‌ఎస్‌లో చేరడంతో ఆ పార్టీ శ్రేణులు అటు తెలంగాణ, ఇటు ఏపీలో ఉలిక్కిపడ్డాయి. టీటీడీఎల్పీ నేత పార్టీ మారడం ఏమిటని కంగారుపడుతున్నాయి. ఎర్రబెల్లి చేరిక రాత్రి వేళలో జరగడంతో ఉదయం లేవగానే పత్రికల్లో ఈ వార్తను చూసి టీడీపీ శ్రేణులు ఎక్కడ షాక్ అవుతాయనుకుందో ఏమో గానీ ఈనాడు పత్రిక అందుకు విరుగుడుగా ఒక కథనం రాసింది.

టీడీపీ శ్రేణులకు పరోక్షంగా గుడ్‌ మార్నింగ్ చెప్పే రేంజ్‌లో కథనం రాసేసింది. టీడీపీ శ్రేణులకు బ్యాడ్‌న్యూస్ దాచి పెట్టి గుడ్‌ న్యూస్ వినిపించేందుకు ఎప్పటిలాగే జగన్‌ను వాడుకుంది. తెలంగాణలో టీడీపీ ఖాళీ అవుతున్న వేళ ఏపీ ఎడిషన్‌లో ఆ విషయాన్ని తొలి పేజీలో ప్రచురించకుండా వైసీపీవారికి కంగారు పుట్టించేలా కథనం అచ్చేసింది. ఈనాడు కథనం ప్రకారం త్వరలోనే ప్రకాశం, గుంటూరు, నెల్లూరు, కృష్ణా జిల్లాలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతారట. బడ్జెట్ సమావేశాల కంటే ముందుగానే ఈ చేరికలుంటాయని కూడా క్వశ్చన్‌ మార్కు పెట్టి ప్రకటించింది. పార్టీలోకి ప్రతిపక్ష ఎమ్మెల్యేల చేరికపై యనమల, లోకేష్ తో చంద్రబాబు ప్రత్యేక సమావేశం కూడా నిర్వహించారట.

ప్రకాశం జిల్లాలో ముగ్గురు, కృష్ణాజిల్లాలో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు పార్టీలోకి వచ్చేందుకు మంతనాలు జరుపుతున్నారని సీఎంకు లోకేష్‌, యనమల వివరించారని కథనం. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏమిటంటే. ఎర్రబెల్లి టీఆర్‌ఎస్‌లో చేరిన విషయాన్ని అన్ని పత్రికలు ఏపీ ఎడిషన్‌లో కూడా తొలి పేజీలలో ప్రచురించాయి. ఈనాడు మాత్రం ఏపీ ఎడిషన్‌లో ఎర్రబెల్లి అంశాన్ని ఎక్కడో లోపలి పేజీల్లో దాచేసింది. ఏపీలో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతున్నారంటూ ఒక ఊహజనిత కథనం మాత్రం తొలిపేజీలో అచ్చేసింది. అంటే నిజాన్ని లోపల దాచి… ఊహను తెరపైకి తెచ్చి బాబు గారి స్టామినా పెంచే ప్రయత్నం చేసిందన్న మాట. కొద్ది రోజుల క్రితం టీడీపీ అనుకూల పత్రిక మరొకటి కూడా ఇలాంటి కథనాన్నే రాసింది.

కర్నూలుజిల్లాలో ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతున్నారని… సంక్రాంతికి లోపే ఆ తంతు పూర్తి అవుతుందని చెప్పింది. ఆ మరుసటి రోజే జగన్‌ బెదిరింపుతో వైసీపీ ఎమ్మెల్యేలు వెనక్కు తగ్గారంటూ ఆది, అంతం రెండూ కూడా ఆ పత్రిక పూర్తి చేసింది. ఇప్పుడు తెలంగాణలో టీడీపీకి పెద్ద ఎదురుదెబ్బ తగలడంతో ఏకంగా ఈనాడే రంగంలోకి దిగినట్టుగా ఉంది. ఇప్పుడు ఈనాడు కథనంలో నిజమెంతో తెలియాలంటే బడ్జెట్ సమావేశాల వరకు ఆగాలి.

Click on Image to Read:

 

Tags:    
Advertisement

Similar News