ముద్రగడ ఇంటి దగ్గర హైడ్రామా-హైకోర్టుకు వెళ్లే యోచన

కాపుల రిజర్వేషన్ల కోసం కాపు నేత ముద్రగడ పద్మనాభం దంపతుల అమరణ దీక్ష కొనసాగుతోంది. వైద్య పరీక్షలు చేయించుకునేందుకు కూడా వారు నిరాకరిస్తున్నారు. రాత్రి 8. 30 సమయంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో వైద్యుల బృందం ముద్రగడ ఇంటికి వెళ్లింది. అయితే  వైద్య పరీక్షలు చేయించుకునేందుకు నిరాకరించిన ముద్రగడ దంపతులు ఇంటి లోపల తలుపులు వేసుకున్నారు. తలుపులు తెరవాలని జాయింట్ కలెక్టర్ కోరినా వారు స్పందించలేదు. ముద్రగడ భార్య బీపీ, షుగర్ తగ్గిందని భావిస్తున్నారు. ఈ […]

Advertisement
Update: 2016-02-05 10:35 GMT

కాపుల రిజర్వేషన్ల కోసం కాపు నేత ముద్రగడ పద్మనాభం దంపతుల అమరణ దీక్ష కొనసాగుతోంది. వైద్య పరీక్షలు చేయించుకునేందుకు కూడా వారు నిరాకరిస్తున్నారు. రాత్రి 8. 30 సమయంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో వైద్యుల బృందం ముద్రగడ ఇంటికి వెళ్లింది. అయితే వైద్య పరీక్షలు చేయించుకునేందుకు నిరాకరించిన ముద్రగడ దంపతులు ఇంటి లోపల తలుపులు వేసుకున్నారు. తలుపులు తెరవాలని జాయింట్ కలెక్టర్ కోరినా వారు స్పందించలేదు. ముద్రగడ భార్య బీపీ, షుగర్ తగ్గిందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముద్రగడ ఇంటిని భారీగా సీఆర్పీఎఫ్ దళాలు చుట్టుముట్టాయి. తలుపులు బలవంతంగా తెరిచేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో ముద్రగడ అనుచరులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు కొద్దిమేర వెనక్కు తగ్గారు.

కాపుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూల స్పందన రావడం లేదని ముద్రగడ ఆరోపించారు. తన దీక్షను భగ్నం చేసేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. శనివారం ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలమయ్యాయని ఆయన చెప్పారు. ప్రభుత్వం ఒక్క మెట్టు కూడా దిగిరావడం లేదని అన్నారు. దీక్ష యథావిథిగా కొనసాగుతుందన్నారు. టీడీపీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు కొన్ని ప్రతిపాదనలు చేశారని ముద్రగడ పద్మనాభం తెలిపారు. వాటికి తాను కొన్ని సవరణలు సూచించానన్నారు. ముఖ్యమంత్రి నుంచి సానుకూల స్పందన రావడం లేదన్నారు.

మరోవైపు కాపుల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై హైకోర్టులో రిట్ వేసే యోచనలో ముద్రగడ బృందం ఉంది. ఆయనను ప్రముఖ న్యాయవాది సతీష్ కలిశారు. కాపులను భయభ్రాంతులను చేసేందుకు పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నారని దీనిపై హైకోర్టును ఆశ్రయిస్తామని న్యాయవాది చెప్పారు. బైండోవర్‌ పత్రాలపై చేసిన సంతకాల వల్ల ఎలాంటి ప్రమాదం లేదని కాపులు భయపడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.

Click on image to Read

 

 

Advertisement

Similar News