పులివెందులపై లెక్క త‌ప్పింది బాబూ!

రాజ‌ధాని ప్రాంతంలో రైతుల పొలాలను ఆగంత‌కులు త‌గ‌ల‌బెట్టినా, రాష్ట్రంలో ఎక్క‌డ ఏమూల అసాంఘిక ఘ‌ట‌న‌లు జ‌రిగినా రాయ‌ల‌సీమ వారిని, ముఖ్యంగా పులివెందుల ప్రాంతం వారిని కించ‌ప‌రుస్తూ మాట్లాడ‌డం చంద్ర‌బాబుకు, టీడీపీ నేత‌ల‌కు అల‌వాటుగా మారింది. తాజాగా తునిలో జ‌రిగిన విధ్వంసం విష‌యంలోనూ రాయ‌ల‌సీమ‌, పులివెందుల ప్రాంతాన్ని కించ‌ప‌రుస్తూ మీడియా స‌మావేశంలోనూ చంద్ర‌బాబు తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. గోదావ‌రి జిల్లాలు ప్ర‌శాంత‌మైన‌వ‌ని, ఇక్క‌డ ప్ర‌జ‌లు శాంత‌ప‌రులు అని కూడా చెప్పారు. అయితే.. విధ్యంసం వెనుక జ‌గ‌న్ మ‌నుషులు, పులివెందుల […]

Advertisement
Update: 2016-02-03 12:20 GMT

రాజ‌ధాని ప్రాంతంలో రైతుల పొలాలను ఆగంత‌కులు త‌గ‌ల‌బెట్టినా, రాష్ట్రంలో ఎక్క‌డ ఏమూల అసాంఘిక ఘ‌ట‌న‌లు జ‌రిగినా రాయ‌ల‌సీమ వారిని, ముఖ్యంగా పులివెందుల ప్రాంతం వారిని కించ‌ప‌రుస్తూ మాట్లాడ‌డం చంద్ర‌బాబుకు, టీడీపీ నేత‌ల‌కు అల‌వాటుగా మారింది. తాజాగా తునిలో జ‌రిగిన విధ్వంసం విష‌యంలోనూ రాయ‌ల‌సీమ‌, పులివెందుల ప్రాంతాన్ని కించ‌ప‌రుస్తూ మీడియా స‌మావేశంలోనూ చంద్ర‌బాబు తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. గోదావ‌రి జిల్లాలు ప్ర‌శాంత‌మైన‌వ‌ని, ఇక్క‌డ ప్ర‌జ‌లు శాంత‌ప‌రులు అని కూడా చెప్పారు. అయితే..

విధ్యంసం వెనుక జ‌గ‌న్ మ‌నుషులు, పులివెందుల వారు ఉన్నారన్న ప్ర‌భుత్వ పెద్ద‌ల ఆరోప‌ణ‌ల్లో నిజాయితీ ఎంతుందో స్వ‌యంగా పోలీసులే తేల్చారు. నిజంగా చంద్ర‌బాబు చెప్పిన‌ట్టు పులివెందుల వారు విధ్వంసం సృష్టించి ఉంటే వారిపై కేసులు న‌మోదు చేయాలి క‌దా!. కానీ అలా జ‌ర‌గ‌లేదు. 27 మంది ముఖ్య‌మైన కాపు నేత‌ల‌పై ప్ర‌భుత్వం కేసులు పెట్టింది. వారిలో ముఖ్యులంతా ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారే, వీహెచ్ తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు. ఇక్క‌డే ముఖ్య‌మంత్రి, హోంమంత్రి మాట‌ల్లోని డొల్ల‌త‌నం బ‌ట్ట‌బ‌య‌లైంది.

జ‌గ‌న్ మీద అక్క‌సుతోనే వారు పులివెందుల‌వారిని దూషించిన‌ట్టు స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతోంది. సీమ‌వాళ్లు విధ్వంసం చేశారని చెప్పి తీరా కేసులు మాత్రం మ‌రో ప్రాంతం వారిపై పెట్టారేంట‌ని ప్ర‌శ్నిస్తే మాత్రం ప్రభుత్వం నుంచి నో స‌మాధానం. అంటే ఇత‌ర విష‌యాల్లో చంద్ర‌బాబు రాయ‌ల‌సీమ‌ వాసుల‌నుద్దేశించి చేసే వ్యాఖ్య‌ల‌న్నీ ఆయన ప్రత్యర్థులపై అక్క‌సుతోనే అన్న మాట‌. ఏదీ ఏమైనా నేతల మీద వ్యక్తిగత కోపం ఉంటే వారిని మాత్రమే తిడితే బాగుంటుంది. ప్రాంతాల పేర్లతో తిట్టడం రాజకీయాలకు మంచిది కాదు.

Click on image to Read

 

 

Tags:    
Advertisement

Similar News