సంగీత సామ్రాట్ కు 75 సంవ‌త్స‌రాలు పూర్తి..!

కె.జె.ఏసుదాస్ మధురగాత్రంలో జాలువారిన ప్రతిపదం అమృతమయమవుతుంది. ఏసుదాస్ గళంలో పలికిన భక్తిగీతాలు మరింత భక్తిభావాన్ని పెంపొందిస్తూ ఉంటాయి. 1940 జనవరి 10న జన్మించిన ఏసుదాస్ నేటితో 76వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఏసుదాస్‌కు ఏడుసార్లు ఉత్తమగాయకునిగా జాతీయ అవార్డు అందుకున్నారు. తెలుగు చిత్రం ‘మేఘసందేశం’ ద్వారా ఏసుదాస్‌ నేషనల్ అవార్డ్ సొంతం చేసుకున్నారు. నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయన పాడిన భక్తిగీతాలను మననం చేసుకుందాం… పర్వదినాల్లో పల్లవించే భక్తిగీతాలు ఏసుదాస్ గాత్రంలో వెలువడిన ఎన్నో భక్తిగీతాలు […]

Advertisement
Update: 2016-01-09 20:01 GMT

కె.జె.ఏసుదాస్ మధురగాత్రంలో జాలువారిన ప్రతిపదం అమృతమయమవుతుంది. ఏసుదాస్ గళంలో పలికిన భక్తిగీతాలు మరింత భక్తిభావాన్ని పెంపొందిస్తూ ఉంటాయి. 1940 జనవరి 10న జన్మించిన ఏసుదాస్ నేటితో 76వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఏసుదాస్‌కు ఏడుసార్లు ఉత్తమగాయకునిగా జాతీయ అవార్డు అందుకున్నారు. తెలుగు చిత్రం ‘మేఘసందేశం’ ద్వారా ఏసుదాస్‌ నేషనల్ అవార్డ్ సొంతం చేసుకున్నారు. నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయన పాడిన భక్తిగీతాలను మననం చేసుకుందాం…

పర్వదినాల్లో పల్లవించే భక్తిగీతాలు
ఏసుదాస్ గాత్రంలో వెలువడిన ఎన్నో భక్తిగీతాలు తెలుగువారిని సైతం పులకింప చేశాయి… ఈ నాటికీ కొన్ని ప్రత్యేక పర్వదినాల్లో ఆయన గానం చేసిన భక్తిగీతాలే తెలుగునాట పల్లవిస్తూ ఉంటాయి… స్వతహాగా కృష్ణభక్తుడైన ఏసుదాస్ గాత్రంలో జాలువారిన కృష్ణగీతాలు మరింతగా మనల్ని కట్టిపడేస్తూ ఉంటాయి…

సంకీర్తనాచార్యునికి మధురనివాళి
తెలుగువారి ఇలవేల్పు, కలియుగదైవం శ్రీవేంకటేశ్వరునిపై అన్నమయ్య రాసిన పదబంధాలు వందల ఏళ్ళుగా తెలుగువారిని పులకింపచేస్తున్నాయి… ఆ సంకీర్తనాచార్యుని గీతాలను సైతం ఆలపించి పరవశింపచేశారు ఏసుదాస్…

మనసులను పులకింపచేసే భక్తిగీతాలు
శ్రీరామ, శ్రీకృష్ణ, శ్రీవేంకటేశ్వర, శ్రీఅయ్యప్ప, షిరిడీ సాయిబాబా స్వామివార్లపై ఏసుదాస్ గానం చేసిన గీతాలు పరమానందం కలిగిస్తూ ఉంటాయి… ఆ పాటలను తలచుకున్నప్పుడల్లా పండితపామరభేదం లేకుండా మనసులు పులకించిపోతుంటాయి… ఇంతటి మధురామృతాన్ని మనకు అందించిన ఏసుదాస్ మరిన్ని వసంతాలు చూస్తూ మరింత ఆనందంగా సాగిపోవాలని ఆశిద్దాం…

Tags:    
Advertisement

Similar News