తల్లి పాత్రలతో వణికిస్తున్న పవిత్రాలోకేష్‌

ఇటీవలి కాలంలో వస్తున్న సినిమాలలో తల్లిపాత్రలను అద్భుతంగా పోషిస్తున్న నటి పవిత్రా లోకేష్‌. తెరమీద నటన విషయంలో ఆమె అంటే సినిమా వాళ్ళకు చాలా ఇష్టమే కాని, తెరవెనుక ఆమెను భరించాలంటే భయపడిపోతున్నారు. ఆమె ఉండేది బెంగుళూరులో. షూటింగ్‌కు హైదరాబాద్‌కు పిలిపించాలంటే, ఆమెకు, ఆమె మేకప్‌మేన్‌కు, అసిస్టెంట్‌కు ఫ్లైట్‌ టిక్కెట్లు బుక్‌చెయ్యాలి. ఖరీదైన హోటళ్ళల్లో రూమ్‌లు బుక్‌చెయ్యాలి. తనతో సమానంగా తన అసిస్టెంట్‌కు మర్యాదలు చెయ్యాలి. షూటింగ్‌ మధ్యలో ఒక్కరోజు గ్యాప్‌ వచ్చినా ఆమె, ఆమె సిబ్బంది […]

Advertisement
Update: 2016-01-08 00:06 GMT

ఇటీవలి కాలంలో వస్తున్న సినిమాలలో తల్లిపాత్రలను అద్భుతంగా పోషిస్తున్న నటి పవిత్రా లోకేష్‌. తెరమీద నటన విషయంలో ఆమె అంటే సినిమా వాళ్ళకు చాలా ఇష్టమే కాని, తెరవెనుక ఆమెను భరించాలంటే భయపడిపోతున్నారు.

ఆమె ఉండేది బెంగుళూరులో. షూటింగ్‌కు హైదరాబాద్‌కు పిలిపించాలంటే, ఆమెకు, ఆమె మేకప్‌మేన్‌కు, అసిస్టెంట్‌కు ఫ్లైట్‌ టిక్కెట్లు బుక్‌చెయ్యాలి. ఖరీదైన హోటళ్ళల్లో రూమ్‌లు బుక్‌చెయ్యాలి. తనతో సమానంగా తన అసిస్టెంట్‌కు మర్యాదలు చెయ్యాలి. షూటింగ్‌ మధ్యలో ఒక్కరోజు గ్యాప్‌ వచ్చినా ఆమె, ఆమె సిబ్బంది మళ్ళీ బెంగుళూరు వెళ్ళిరావడానికి ఫ్లైట్‌ టిక్కెట్స్‌ బుక్‌చెయ్యాలి. ఇతర ఖర్చుల విషయంలోనూ ఆమె అంటే భయపడిపోతున్నారు నిర్మాతలు. ఆమెను భరించాలంటే ప్రొడక్షన్‌ మేనేజర్లు వణికిపోతున్నారు. ఆమెను బుక్‌చెయ్యవద్దని నిర్మాతల్ని బ్రతిమలాడే పరిస్థితి వచ్చిందిప్పుడు. మన తెలుగువాళ్ళు ఇంతమంది ఉండగా ఈమెను ఎందుకు బెంగుళూరునుంచి పిలిపిస్తారు? అని తలలు పట్టుకుంటున్నారు ప్రొడక్షన్‌ మేనేజర్లు.

Click to Read:

Tags:    
Advertisement

Similar News