వెనక్కు తగ్గే యోచనలో నాగ్‌! ఎందుకు?

లాభనష్టాలు లెక్కచేయకుండా ఈ సారి సంక్రాంతి బరిలో దూకేందుకు అగ్రహీరోలు సిద్ధమవుతున్నారు. బాలయ్య డిక్టేటర్, ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో, నాగ్‌ సోగ్గాడే చిన్నినాయన, ఎక్స్‌ప్రెస్‌రాజా సంక్రాంతి బరిలో దూకడం ఖాయంగా భావించారు. బాబాయ్ అబ్బాయిలో ఒకరు వెనక్కు తగ్గితే బాగుంటుందని నందమూరి ఫ్యాన్స్ భావించినా అది సాధ్యమవుతున్న నమ్మకం లేదు. ఈ నేపథ్యంలో నాగార్జున ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. సినిమాలు ఎక్కువయ్యే సరికి థియేటర్ల కొరత కూడా వెంటాడుతోంది. దీంతో ఈ పోటీ ఆరోగ్యకరమైనది కాదన్న భావనకు […]

Advertisement
Update: 2016-01-03 10:08 GMT

లాభనష్టాలు లెక్కచేయకుండా ఈ సారి సంక్రాంతి బరిలో దూకేందుకు అగ్రహీరోలు సిద్ధమవుతున్నారు. బాలయ్య డిక్టేటర్, ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో, నాగ్‌ సోగ్గాడే చిన్నినాయన, ఎక్స్‌ప్రెస్‌రాజా సంక్రాంతి బరిలో దూకడం ఖాయంగా భావించారు. బాబాయ్ అబ్బాయిలో ఒకరు వెనక్కు తగ్గితే బాగుంటుందని నందమూరి ఫ్యాన్స్ భావించినా అది సాధ్యమవుతున్న నమ్మకం లేదు. ఈ నేపథ్యంలో నాగార్జున ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది.

సినిమాలు ఎక్కువయ్యే సరికి థియేటర్ల కొరత కూడా వెంటాడుతోంది. దీంతో ఈ పోటీ ఆరోగ్యకరమైనది కాదన్న భావనకు నాగ్ వచ్చారని చెబుతున్నారు. పైగా తన సినిమాపై నాగార్జున చాలా ధీమాగా ఉన్నారట. సంక్రాంతి సీజన్ కాకపోయినా తన చిత్రం విజయవంతమవడం ఖాయమన్న నమ్మకంతో నాగ్ ఉన్నారు. అందుకే సంక్రాంతి బరి నుంచి తప్పుకోవడమే మంచిదన్న భావనకు వచ్చారట. పట్టింపులకు పోయి పోటీ పడితే అందరికీ నష్టమేనన్న భావనతో ఉన్నారని చెబుతున్నారు. ఒకవేళ ”నాన్నకు ప్రేమతో” వెనక్కు తగ్గితే సంక్రాంతికి విడుదల చేయాలని లేని పక్షంలో జనవరి 22న సోగ్గాడిని రిలీజ్ చేయాలన్న ఆలోచనతో నాగార్జున ఉన్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే దీనిపై చిత్రయూనిట్ నుంచి అధికార ప్రకటన ఇంకా వెలువడలేదు.

Click to Read:

Tags:    
Advertisement

Similar News