ప్రముఖ నటుడు రంగనాథ్ ఆత్మహత్య!

ప్రముఖ సీనియర్ నటుడు రంగనాథ్ కన్నుమూశారు. హైదరాబాద్‌ కవాడీగూడలోని తన నివాసంలో ఆయన అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. వంటగదిలో ఆయన ఊరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పనిమనిషి బయటకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. ఆమె వచ్చేసరికి తలుపువేసి ఉండటంతో తలుపులు బద్దలుకొట్టి కుటుంబ సభ్యులు లోపలికి వెళ్లారు. అప్పటికే రంగనాథ్ ప్రాణాలు కోల్పోయారు. రంగనాథ్‌ మరణంపై బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. రంగనాథ్‌ది ఆత్మహత్యనా కాదా అన్న కోణంలో […]

Advertisement
Update: 2015-12-19 09:11 GMT

ప్రముఖ సీనియర్ నటుడు రంగనాథ్ కన్నుమూశారు. హైదరాబాద్‌ కవాడీగూడలోని తన నివాసంలో ఆయన అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. వంటగదిలో ఆయన ఊరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పనిమనిషి బయటకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. ఆమె వచ్చేసరికి తలుపువేసి ఉండటంతో తలుపులు బద్దలుకొట్టి కుటుంబ సభ్యులు లోపలికి వెళ్లారు. అప్పటికే రంగనాథ్ ప్రాణాలు కోల్పోయారు. రంగనాథ్‌ మరణంపై బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. రంగనాథ్‌ది ఆత్మహత్యనా కాదా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు.

కొంతకాలంగా రంగనాథ్‌ అనారోగ్యంతో బాధపడుతున్నారు. భార్య తీవ్ర అనారోగ్యానికి గురైన సమయంలో దగ్గరుండి ఆమెకు సేవలు చేశారు. ఆమె మరణం తర్వాత రంగనాథ్‌ మానసికంగా బాగా కుంగిపోయారని చెబుతున్నారు. రంగనాథ్ 1949లో మద్రాసులో జన్మించారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. దాదాపు 300 సినిమాల్లో నటించారు. మెగుడ్స్‌-పెళ్లామ్స్ సినిమాకు దర్శకత్వం వహించారు. సినిమాల్లోకి రాకముందు ఆయన రైల్వే టీసీగా పనిచేశారు.

Tags:    
Advertisement

Similar News