పవన్‌ పుస్తక రచయితకు భద్రత

”పవన్‌ కల్యాణ్ హటావో… పాలిటిక్స్ బచావో” పేరుతో పుస్తకాన్ని రచించిన బొగ్గుల శ్రీనివాస్‌కు ప్రభుత్వం భద్రత కల్పించింది. ఎన్టీఆర్‌ స్టేడియంలో జరుగుతున్న(శుక్రవారం ప్రారంభం) బుక్‌ ఫెయిర్‌లో బొగ్గుల శ్రీనివాస్‌ ఒక స్టాల్ ఏర్పాటు చేస్తున్నారు. రాజకీయంగా పవన్‌ గతంలో ఎలా వ్యవహరించారు… ఇప్పుడు ఎలా వ్యవహరిస్తున్నారు అన్న దానిపై విమర్శలు చేస్తే బొగ్గుల శ్రీనివాస్‌ పుస్తకం రచించారు. ఆ పుస్తకాన్ని స్టాల్‌లో ఉంచుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్‌ కల్యాణ్ అభిమానుల నుంచి దాడులు జరిగే అవకాశం ఉందని […]

Advertisement
Update: 2015-12-17 20:54 GMT

”పవన్‌ కల్యాణ్ హటావో… పాలిటిక్స్ బచావో” పేరుతో పుస్తకాన్ని రచించిన బొగ్గుల శ్రీనివాస్‌కు ప్రభుత్వం భద్రత కల్పించింది. ఎన్టీఆర్‌ స్టేడియంలో జరుగుతున్న(శుక్రవారం ప్రారంభం) బుక్‌ ఫెయిర్‌లో బొగ్గుల శ్రీనివాస్‌ ఒక స్టాల్ ఏర్పాటు చేస్తున్నారు. రాజకీయంగా పవన్‌ గతంలో ఎలా వ్యవహరించారు… ఇప్పుడు ఎలా వ్యవహరిస్తున్నారు అన్న దానిపై విమర్శలు చేస్తే బొగ్గుల శ్రీనివాస్‌ పుస్తకం రచించారు. ఆ పుస్తకాన్ని స్టాల్‌లో ఉంచుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్‌ కల్యాణ్ అభిమానుల నుంచి దాడులు జరిగే అవకాశం ఉందని భద్రత కల్పించాలని టీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలిసి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. హోంమంత్రి ఆదేశాలతో బొగ్గుల శ్రీనివాస్‌కు, అతడి స్టాల్‌కు తాత్కాలికంగా పోలీసులు రక్షణ కల్పించారు.

Tags:    
Advertisement

Similar News