సాక్షి వర్సెస్‌ సీఎం రమేష్

అవుకు రిజర్యాయర్ సొరంగం పనులకు ప్రభుత్వం అదనంగా 44 కోట్లు చెల్లిస్తున్న విషయం చివరకు సాక్షి పత్రిక, టీడీపీ ఎంపీ సీఎం రమేష్ మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లు అన్నట్టు తయారైంది. రిజర్వాయర్‌ సొరంగం పనులకు అదనంగా సొమ్ము చెల్లించడం సరికాదంటూ ఇటీవల సీఎం రమేష్ ప్రభుత్వానికి లేఖ రాశారు. అయితే ఈ అదనపు కేటాయింపుల వెనుక జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ హస్తముందని.. ఉమపై కోపంతోనే సీఎం రమేష్‌ ప్రభుత్వానికి లేఖ రాశారని సాక్షి పత్రిక […]

Advertisement
Update: 2015-11-22 23:37 GMT

అవుకు రిజర్యాయర్ సొరంగం పనులకు ప్రభుత్వం అదనంగా 44 కోట్లు చెల్లిస్తున్న విషయం చివరకు సాక్షి పత్రిక, టీడీపీ ఎంపీ సీఎం రమేష్ మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లు అన్నట్టు తయారైంది. రిజర్వాయర్‌ సొరంగం పనులకు అదనంగా సొమ్ము చెల్లించడం సరికాదంటూ ఇటీవల సీఎం రమేష్ ప్రభుత్వానికి లేఖ రాశారు. అయితే ఈ అదనపు కేటాయింపుల వెనుక జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ హస్తముందని.. ఉమపై కోపంతోనే సీఎం రమేష్‌ ప్రభుత్వానికి లేఖ రాశారని సాక్షి పత్రిక ఇటీవల కథనాన్ని ప్రచురించింది. గతంలో తన కంపెనీ చేపట్టిన గాలేరునగరి సుజలస్రవంతి పనులకు అంచనా వ్యయం పెంచిన విషయం ఉమ వల్లే బయటకు వచ్చిందన్న కోపంతోనే సీఎం రమేష్ అవుకు వ్యవహారాన్నిబయటపెట్టారని సాక్షి చెప్పింది.

ఈనేపథ్యంలో సీఎం రమేష్ ఆదివారం ప్రెస్ మీట్ పెట్టి సాక్షి పత్రికపై విమర్శలు చేశారు. ఉమతో విభేదాల కారణంగానే తాను లేఖ రాశానంటూ అసత్యాలు ప్రచురించారని మండిపడ్డారు. దేవినేని ఉమ నిప్పు అని చెప్పారు. క్షమాపణ చెప్పకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. అయితే రమేష్ వ్యాఖ్యలకు తిరిగి సాక్షి పత్రిక కౌంటర్ ఇచ్చింది.

చంద్రబాబునాయుడు, ఉమ నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతోనే.. ఎటూ పాలుపోకే రమేష్ పొంతన లేని వివరణ ఇచ్చారని రాసింది. అవినీతి జరగలేదని చెప్పడానికి మాత్రం సీఎం రమేష్ సాహసించలేదని వెల్లడించింది. అవుకు రిజర్వాయర్ కాంట్రాక్టరుకు అదనంగా డబ్బు చెల్లించాలంటూ ఉత్తర్వులు ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వమే అయినప్పుడు మరి సదరు శాఖ మంత్రి ఉమ నిప్పు ఎలా అవుతారో రమేష్ చెప్పాలని సాక్షి పత్రిక తన కథనంలో ప్రశ్నించింది.

Click Here to Read :A flop team in search of success

Tags:    
Advertisement

Similar News