తమ్ముళ్ల నాలెడ్జ్‌తో షాక్‌ అయిన చంద్రబాబు

16నెలల పాలనలో ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై టీడీపీ కార్యకర్తలు, చిన్నచిన్న నాయకులకు ఉన్న అవగాహన చూసి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే ఆశ్చర్యపోయినట్టు సమాచారం. ఇటీవల తిరుపతిలో రెండు రోజులపాటు జరిగిన దిశానిర్దేశ సదస్సులో తమ్ముళ్ల నాలెడ్జ్‌ను చంద్రబాబు స్వయంగా పరీక్షించి తెలుసుకున్నారు. 13జిల్లాలను ఐదు విభాగాలుగా విభజించి ఆయా విభాగాల జిల్లాల నేతలతో చంద్రబాబు, లోకేష్ కలిసి సమావేశమయ్యారు. ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే ఏం చేయాలో చెప్పాలని కార్యకర్తల నుంచి సలహాలు తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న […]

Advertisement
Update: 2015-11-18 00:48 GMT

16నెలల పాలనలో ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై టీడీపీ కార్యకర్తలు, చిన్నచిన్న నాయకులకు ఉన్న అవగాహన చూసి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే ఆశ్చర్యపోయినట్టు సమాచారం. ఇటీవల తిరుపతిలో రెండు రోజులపాటు జరిగిన దిశానిర్దేశ సదస్సులో తమ్ముళ్ల నాలెడ్జ్‌ను చంద్రబాబు స్వయంగా పరీక్షించి తెలుసుకున్నారు. 13జిల్లాలను ఐదు విభాగాలుగా విభజించి ఆయా విభాగాల జిల్లాల నేతలతో చంద్రబాబు, లోకేష్ కలిసి సమావేశమయ్యారు. ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే ఏం చేయాలో చెప్పాలని కార్యకర్తల నుంచి సలహాలు తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న పథకాలను ప్రజల్లో తీసుకెళ్లాలని చంద్రబాబు సూచించారు. ఈ సమయంలోనే…

ఇప్పుడున్నప్రభుత్వ పథకాలపై ఎంతమందికి అవగాహన ఉందో చేతులెత్తాల్సిందిగా చంద్రబాబు కోరారట. అయితే బాబుకు షాకిస్తూ కేవలం 20 శాతం మంది మాత్రమే చేతులెత్తారట. వారిలోనూ చాలా మంది చేతులెత్తితే ఓ పనైపోతుంది అన్నట్టుగా వ్యవహరించిన వారే. క్రాస్ చెక్ చేస్తే వారికి కూడా పథకాలపై సరైన అవగాహన లేదని తేలిపోయింది. కొందరు ఇప్పటికీ ఎన్టీఆర్ వైద్య సేవను… ఆరోగ్యశ్రీగానే భావిస్తున్నారు . ఇక ”మీ ఇంటికి – మీ భూమి”, ఈ- పాస్, నీరు- చెట్టు వంటి పథకాల గురించి తెలుగు తమ్ముళ్లకు అవగాహన జీరో అని తేలింది. ఈ పరిస్థితిని చూసి చంద్రబాబే ఖంగుతిన్నారని సమాచారం. కార్యకర్తలకు, నేతలకే పథకాలపై అవగాహన లేకుంటే ఇక జనానికి ఏం చెబుతారని అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది. ప్రజల కంటే ముందుగా కార్యకర్తలు, నేతలు పథకాలపై అవగాహన పెంచుకోవాలని చంద్రబాబు సూచించారు.

Tags:    
Advertisement

Similar News