సుల్తాన్ జయంతిలో హింస, వీహెచ్‌పీ కార్యకర్త మృతి

దేశంలో మత అసహనం తగ్గడం లేదు. కర్నాటకలోని మడికెరిలో ఓ వర్గం వారు టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలు జరుపుకుంటుండగా వీహెచ్‌పీ కార్యకర్తలు అడ్డుతగిలారు. సుల్తాన్ జయంతి వేడుకలు నిర్వహించడానికి వీల్లేదంటూ ఆందోళనకు దిగారు. దీంతో హింస చెలరేగింది. ఇరు వర్గాలు రాళ్ల వర్షం కురిపించుకున్నాయి. రాళ్ల దాడిలో చట్టప్ప అనే వీహెచ్‌పీ కార్యకర్త మృతి చెందాడు. భారీగా చేరుకున్న పోలీసులు లాఠీచార్జ్ చేశారు. భాష్పవాయువు ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు. నియంత అయిన టిప్పు సుల్తాన్‌ జయంతిని […]

Advertisement
Update: 2015-11-10 03:20 GMT

దేశంలో మత అసహనం తగ్గడం లేదు. కర్నాటకలోని మడికెరిలో ఓ వర్గం వారు టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలు జరుపుకుంటుండగా వీహెచ్‌పీ కార్యకర్తలు అడ్డుతగిలారు. సుల్తాన్ జయంతి వేడుకలు నిర్వహించడానికి వీల్లేదంటూ ఆందోళనకు దిగారు. దీంతో హింస చెలరేగింది. ఇరు వర్గాలు రాళ్ల వర్షం కురిపించుకున్నాయి. రాళ్ల దాడిలో చట్టప్ప అనే వీహెచ్‌పీ కార్యకర్త మృతి చెందాడు. భారీగా చేరుకున్న పోలీసులు లాఠీచార్జ్ చేశారు. భాష్పవాయువు ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు. నియంత అయిన టిప్పు సుల్తాన్‌ జయంతిని ఎలా నిర్వహిస్తారని వీహెచ్‌పీ వాళ్లు ప్రశ్నిస్తున్నారు.

 

Tags:    
Advertisement

Similar News