'అసహనం'పై నిరసన... సినీ జాతీయ అవార్డులు వాపస్‌

దేశంలో పెరిగిపోతున్న మత అసహనానికి, మేధావుల, రచయితల హత్యకు, పుణేలోని భారత ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ వ్యవహారానికి నిరసనగా బాలీవుడ్‌కు చెందిన పది మంది సినీ నిర్మాతలు తమ జాతీయ అవార్డులను వెనక్కి ఇచ్చేస్తున్నట్టు ప్రకటించారు. పుణేలోని భారత ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన విద్యార్థులు చైర్మన్‌ గజేంద్ర చౌహాన్‌ను తప్పించాలని నాలుగు నెలలుగా సమ్మె చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం దిగి రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని నిర్మాత దివాకర్‌ బెనర్జీ తెలిపారు. 2008, 2010లో బెనర్జీకి రెండు జాతీయ […]

Advertisement
Update: 2015-11-04 12:31 GMT

దేశంలో పెరిగిపోతున్న మత అసహనానికి, మేధావుల, రచయితల హత్యకు, పుణేలోని భారత ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ వ్యవహారానికి నిరసనగా బాలీవుడ్‌కు చెందిన పది మంది సినీ నిర్మాతలు తమ జాతీయ అవార్డులను వెనక్కి ఇచ్చేస్తున్నట్టు ప్రకటించారు. పుణేలోని భారత ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన విద్యార్థులు చైర్మన్‌ గజేంద్ర చౌహాన్‌ను తప్పించాలని నాలుగు నెలలుగా సమ్మె చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం దిగి రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని నిర్మాత దివాకర్‌ బెనర్జీ తెలిపారు. 2008, 2010లో బెనర్జీకి రెండు జాతీయ పురస్కారాలు లభించాయి.. గజేంద్ర చౌహాన్‌ ఎంపిక పారదర్శకంగా జరగలేదని, ఈ విషయాన్ని ప్రసార మంత్రిత్వశాఖకు నివేదించినా ఫలితం కనిపించలేదని బెనర్జీ చెప్పారు. జాతీయ పురస్కారాలను వాపసు చేసినవారిలో బెనర్జీతోపాటు ఆనంద్‌ పట్వర్ధన్‌, హారి నాయర్‌, కృతీ నఖ్వా, హర్షవర్ధన్‌ కులకర్ణి, నిషితా జైన్‌, పరేశ్‌ కాందార్‌, రాకేశ్‌ శర్మ, ఇంద్ర నీల్‌ లహరి, లిపికా సింగ్‌ దరైలు ఉన్నారు.

Tags:    
Advertisement

Similar News