భారత్‌ ఐక్యతకు పటేలే మోడల్‌ ఐకాన్‌: మోదీ

చాణుక్యుడి తర్వాత దేశాన్ని ఏకతాటి పైకి తెచ్చిన ఘనత పటేల్‌దేనని ప్రధానమంత్రి నరేంద్రమోది కొనియాడారు. ఈ ఐక్యతా కృషిని జాతి మరిచిపోకూడదని ఆయన అన్నారు. సర్దార్ వల్లభాయ్‌పటేల్ 140వ జయంతి సందర్భంగా శనివారం పటేల్ స్మారకస్పూపం వద్ద మోదీ నివాళులర్పించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ పటేల్ కౌశలం ఎంతో గొప్పదన్నారు. పటేల్ స్ఫూర్తితో ఐక్య, శ్రేష్ఠ భారత్ సాధన దిశగా నడవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. పటేల జయంతి సందర్భంగా రాజ్‌పథ్‌లో ఏర్పాటు చేసిన యూనిటీ రన్‌ను […]

Advertisement
Update: 2015-10-31 00:02 GMT

చాణుక్యుడి తర్వాత దేశాన్ని ఏకతాటి పైకి తెచ్చిన ఘనత పటేల్‌దేనని ప్రధానమంత్రి నరేంద్రమోది కొనియాడారు. ఈ ఐక్యతా కృషిని జాతి మరిచిపోకూడదని ఆయన అన్నారు. సర్దార్ వల్లభాయ్‌పటేల్ 140వ జయంతి సందర్భంగా శనివారం పటేల్ స్మారకస్పూపం వద్ద మోదీ నివాళులర్పించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ పటేల్ కౌశలం ఎంతో గొప్పదన్నారు. పటేల్ స్ఫూర్తితో ఐక్య, శ్రేష్ఠ భారత్ సాధన దిశగా నడవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. పటేల జయంతి సందర్భంగా రాజ్‌పథ్‌లో ఏర్పాటు చేసిన యూనిటీ రన్‌ను మోదీ జెండా ఊపి ప్రారంభించారు. కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, వెంకయ్యనాయుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ నజీబ్‌ జంగ్ తదితరులు పాల్గొన్నారు. యూనిటీ రన్‌లో పాఠశాల విద్యార్థులు, క్రీడాకారులు, ప్రజలు పాల్గొన్నారు.

Tags:    
Advertisement

Similar News