పవర్ అండ మెగాకొద్దు.. చెర్రీకి కావాలి....

చిరంజీవి షష్టి పూర్తి సంధర్బంగా ఆరోజు ఉదయం జరిగిన వేడుకలకు పవర్ స్టార్ హాజరు కాలేదు. ఆ సంధర్బంగా పవర్ స్టార్ అభిమానులు ప్రశ్నించినందుకు నాగబాబు చాలా ఆవేశపడ్డారు. మీకు చేతైతే పవర్ స్టార్ ను ఈ వేడుకులకు తీసుకరావాలని పవర్ స్టార్ అభిమానులకు ఛాలెం జ్ విసిరారు. మా తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వేడుకలకు వస్తే సంతోషమేనని ఒక వేళ రాకపోయిన నష్టమేమిలేదనట్టు మాట్లాడారు. చిరంజీవి లేకపోతే నేను, పవర్ స్టార్, చరణ్ […]

Advertisement
Update: 2015-10-19 03:05 GMT
చిరంజీవి షష్టి పూర్తి సంధర్బంగా ఆరోజు ఉదయం జరిగిన వేడుకలకు పవర్ స్టార్ హాజరు కాలేదు. ఆ సంధర్బంగా పవర్ స్టార్ అభిమానులు ప్రశ్నించినందుకు నాగబాబు చాలా ఆవేశపడ్డారు. మీకు చేతైతే పవర్ స్టార్ ను ఈ వేడుకులకు తీసుకరావాలని పవర్ స్టార్ అభిమానులకు ఛాలెం జ్ విసిరారు. మా తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వేడుకలకు వస్తే సంతోషమేనని ఒక వేళ రాకపోయిన నష్టమేమిలేదనట్టు మాట్లాడారు. చిరంజీవి లేకపోతే నేను, పవర్ స్టార్, చరణ్ మా కుటుంబ హీరోలు ఎక్కడుండేవారని ప్రశ్నించారు. సో చిరంజీవికి ఎవరి అండ అవసరం లేదనట్టు వ్యాఖ్యానించారు. నాగబాబు మాట్లాడింది నూటికి నూరు పాళ్ళు నిజం. మెగాకు ఎవరి అండా అక్కర్లేదు.
కాని రామ్ చరణ్ కు అందరి అండా అవసరమే. ముఖ్యంగా పవరస్టార్ అండ చాలా అవసరం. ఇటీవల విడుదలైన బ్రూస్ లీ ఊహించని రీతిలో సక్సస్ కాకపోవటంతో ఆ సినిమాని గట్టెకించటంలో మెగా సహాయం చాలకపోవటంతో ఇప్పుడూ పవర్ స్టార్ సపోర్ట్ అవసర‌మైంది. పవర్ స్టార్ అభిమానులు పూనుకుంటే తప్ప ఆ సినిమా సక్సస్ అయ్యే పరిస్థితి లేదు. అందుకే ఈ భారాన్ని కుటుంబ సభ్యులు ఎవరు భుజాన వేసుకున్నారొ గాని చిరు, పవన్, చరణ్ లను ఒక చోట కలిపారు. తద్వారా పవన అభిమానులకు ఒక సంకేతం పంపారు. పవన్ అభిమానులు పెద్ద మనస్సు చేసుకొని వాళ్ళ ఆంతర్యం గ్రహించి సినిమా సక్సస్ కు పూనుకుంటే చరణ్ ఈ ఫ్లాప్ నుంచి బయటపడే అవకాశం ఉంది.
Tags:    
Advertisement

Similar News