రాజకీయం వేరు... మేమంతా ఒక్కటే!

మెగాబ్రదర్స్ మధ్య గ్యాప్ మాయమైపోతోంది. చిరు, పవన్ మధ్య సరైన సంబంధాలు లేవన్న భావన నెలకొన్న నేపథ్యంలో పవన్‌ నేరుగా చిరు ఇంటికి వెళ్లారు. అన్నదమ్ములిద్దరూ ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. కులసప్రశ్నలు వేసుకున్నారు. బ్రూస్‌లీలో నటించిన అన్నయ్యకు తమ్ముడు శుభాకాంక్షలు తెలిపారు. సర్దార్ గబ్బర్ సింగ్‌ గెటప్‌లోనే పవన్ అన్న ఇంటికి వెళ్లారు. రామ్‌చరణ్ తేజ గేటు వద్దకు ఎదురొచ్చి బాబాయికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పవన్  రాజకీయంగా వేర్వరు అభిప్రాయాలున్నా.. కుటుంబపరంగా తామంతా […]

Advertisement
Update: 2015-10-18 06:52 GMT

మెగాబ్రదర్స్ మధ్య గ్యాప్ మాయమైపోతోంది. చిరు, పవన్ మధ్య సరైన సంబంధాలు లేవన్న భావన నెలకొన్న నేపథ్యంలో పవన్‌ నేరుగా చిరు ఇంటికి వెళ్లారు. అన్నదమ్ములిద్దరూ ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. కులసప్రశ్నలు వేసుకున్నారు. బ్రూస్‌లీలో నటించిన అన్నయ్యకు తమ్ముడు శుభాకాంక్షలు తెలిపారు. సర్దార్ గబ్బర్ సింగ్‌ గెటప్‌లోనే పవన్ అన్న ఇంటికి వెళ్లారు. రామ్‌చరణ్ తేజ గేటు వద్దకు ఎదురొచ్చి బాబాయికి స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పవన్ రాజకీయంగా వేర్వరు అభిప్రాయాలున్నా.. కుటుంబపరంగా తామంతా ఒక్కటేనని అన్నారు. కొద్దిరోజుల క్రితం చిరు 60వ పుట్టిన రోజు సందర్భంగానూ అన్నయ్య ఇంటికి పవన్ వెళ్లారు. రాజధాని శంకుస్థాపనకు వెళ్లాలని తనకూ ఉందన్నారు పవన్. అయితే తన షూటింగ్ తేదీలను బట్టి… శంకుస్థాపనకు హాజరుపై నిర్ణయించుకుంటానన్నారు. . రామ్‌చరణ్ బాబాయి పవన్‌ను షూటింగ్ స్పాట్‌కు వెళ్లి కలిశారు.

Tags:    
Advertisement

Similar News