మరో రికార్డు దిశగా రుద్రమదేవి

మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ రుద్రమదేవి సినిమా దూసుకుపోతోంది. థియేటర్లలో స్టడీగా రన్ అవుతోంది. ఇప్పటికే ప్రాఫిట్ జోన్ లోకి ఎంటరైన ఈ సినిమా ఇప్పుడు విదేశాల్లో కూడా ఓ అరుదైన రికార్డు సృష్టించే దిశగా దూసుకుపోతోంది. ఈ వీకెండ్ గడిస్తే.. రుద్రమదేవికి ఓవర్సీస్ లో లక్ష డాలర్ల వసూళ్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రుద్రమదేవి ఓవర్సీస్ వసూళ్ల మొత్తం 85 వేల డాలర్లు. మరో 15వేల డాలర్లు పోగైతే.. రుద్రమదేవి రికార్డు సృష్టించడం ఖాయం. […]

Advertisement
Update: 2015-10-17 19:15 GMT
మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ రుద్రమదేవి సినిమా దూసుకుపోతోంది. థియేటర్లలో స్టడీగా రన్ అవుతోంది. ఇప్పటికే ప్రాఫిట్ జోన్ లోకి ఎంటరైన ఈ సినిమా ఇప్పుడు విదేశాల్లో కూడా ఓ అరుదైన రికార్డు సృష్టించే దిశగా దూసుకుపోతోంది. ఈ వీకెండ్ గడిస్తే.. రుద్రమదేవికి ఓవర్సీస్ లో లక్ష డాలర్ల వసూళ్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రుద్రమదేవి ఓవర్సీస్ వసూళ్ల మొత్తం 85 వేల డాలర్లు. మరో 15వేల డాలర్లు పోగైతే.. రుద్రమదేవి రికార్డు సృష్టించడం ఖాయం. ఇప్పటివరకు పవన్, మహేష్, బన్నీ లాంటి స్టార్ వాల్యూ ఉన్న నటులు మాత్రమే లక్ష డాలర్లు సంపాదించగలిగారు. మరోవైపు కథాబలం ఉన్న బాహుబలి, ఈగ లాంటి సినిమాలు కూడా లక్ష డాలర్లు వసూలు చేశాయి. ఇప్పుడు రుద్రమదేవి కనుక మిలియన్ డాలర్ క్లబ్ లోికి చేరితే.. ఓ హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా రికార్డు సృష్టించినట్టవుతుంది. మరి రుద్రమదేవికి ఈ 4 రోజుల్లో 15 వేల డాలర్లు వస్తాయా.. విదేశాల్లో టిక్కెట్ రేట్లు తగ్గించడం వల్ల ప్రేక్షకుల సంఖ్య పెరిగి రికార్డు సృష్టించడం ఖాయమంటున్నారు మేకర్స్.
Tags:    
Advertisement

Similar News