నిఖిల్ కోసం పవన్ కల్యాణ్

నితిన్ కోసం పవన్ కల్యాణ్ అంటే ఓకే అనుకోవచ్చు. ఎందుకంటే.. నితిన్ పవన్ కల్యాణ్ కు వీరభక్తుడు. కాబట్టి నితిన్ కోసం పవన్ ఏమైనా చేశాడంటే అర్థం ఉంది. కానీ ఇది నితిన్ కోసం పవన్ కాదు.. నిఖిల్ కోసం పవన్. అవును.. ఈసారి నిఖిల్ సినిమా కోసం పవర్ స్టార్ ప్రచారకర్తగా మారాడు. నిఖిల్ నటిస్తున్న శంకరాభరణం సినిమాకు ఫుల్ ప్రమోషన్ తెచ్చిపెట్టడానికి పవన్ రంగంలోకి దిగుతున్నాడు. శంకరాభరణం సినిమా ట్రయిలర్ ను పవన్ చేతులు […]

Advertisement
Update: 2015-10-13 19:04 GMT
నితిన్ కోసం పవన్ కల్యాణ్ అంటే ఓకే అనుకోవచ్చు. ఎందుకంటే.. నితిన్ పవన్ కల్యాణ్ కు వీరభక్తుడు. కాబట్టి నితిన్ కోసం పవన్ ఏమైనా చేశాడంటే అర్థం ఉంది. కానీ ఇది నితిన్ కోసం పవన్ కాదు.. నిఖిల్ కోసం పవన్. అవును.. ఈసారి నిఖిల్ సినిమా కోసం పవర్ స్టార్ ప్రచారకర్తగా మారాడు. నిఖిల్ నటిస్తున్న శంకరాభరణం సినిమాకు ఫుల్ ప్రమోషన్ తెచ్చిపెట్టడానికి పవన్ రంగంలోకి దిగుతున్నాడు. శంకరాభరణం సినిమా ట్రయిలర్ ను పవన్ చేతులు మీదుగా లాంచ్ చేస్తున్నారు. అలా నిఖిల్ సినిమాకు పిచ్చ పబ్లిసిటీ రాబోతోంది. ఈ కాంబినేషన్ ను సెట్ చేసింది మాత్రం కోన వెంకట్. శంకరాభరణం సినిమాకు తెరవెనక రింగ్ మాస్టర్ గా వ్యవహరిస్తున్న కోన వెంకట్, పవన్ కల్యాణ్ కు బెస్ట్ ఫ్రెండ్. ఆ ఫ్రెండ్ షిప్ కొద్దీ కోనకు సంబంధించిన శంకరాభరణం సినిమా ట్రయిలర్ ను విడుదల చేయడానికి ఒప్పుకున్నాడు పవన్. పవర్ స్టార్ చేతుల మీదుగా విడుదలైన ఆ ట్రయిలర్ ను చెర్రీ నటిస్తున్న బ్రూస్ లీ సినిమా ఇంటర్వెల్ టైమ్ లో ప్రసారం చేస్తారు.
Tags:    
Advertisement

Similar News