పవన్ సినిమా స్టిల్స్ లీకయ్యాయి

పవన్ ఓ సినిమా చేస్తున్నాడంటే ఆ మూవీ స్టిల్స్ ఎప్పుడు బయటకొస్తాయా.. ఆ సినిమా టీజర్ ఎప్పుడు నెట్ లోకి వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తారు ప్రేక్షకులు. కానీ పవన్ మాత్రం టైమింగ్ చూసి ఒక్కొక్కటి విడుదల చేస్తుంటాడు. నిజానికి మిగతా హీరోల సినిమాల్లా పవన్ సినిమాకు సంబంధించిన స్టిల్స్, వీడియోలు బయట పెద్దగా లీకవ్వవు. సెట్స్ లో పవర్ స్టార్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు. అందుకే ఇలాంటి లీకేజీలు పవన్ ను ఇబ్బందిపెట్టవు. కానీ […]

Advertisement
Update: 2015-10-03 19:02 GMT
పవన్ ఓ సినిమా చేస్తున్నాడంటే ఆ మూవీ స్టిల్స్ ఎప్పుడు బయటకొస్తాయా.. ఆ సినిమా టీజర్ ఎప్పుడు నెట్ లోకి వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తారు ప్రేక్షకులు. కానీ పవన్ మాత్రం టైమింగ్ చూసి ఒక్కొక్కటి విడుదల చేస్తుంటాడు. నిజానికి మిగతా హీరోల సినిమాల్లా పవన్ సినిమాకు సంబంధించిన స్టిల్స్, వీడియోలు బయట పెద్దగా లీకవ్వవు. సెట్స్ లో పవర్ స్టార్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు. అందుకే ఇలాంటి లీకేజీలు పవన్ ను ఇబ్బందిపెట్టవు. కానీ సర్దార్ గబ్బర్ సింగ్ విషయంలో మాత్రం ఓ లీకేజీని పవన్ కూడా ఆపలేకపోయాడు. ఈమధ్యే లక్ష్మీరాయ్ తో కలిసి ఐటెంసాంగ్ పూర్తిచేశాడు పవన్. లేకలేక పవన్ తో అవకాశం వచ్చేసరికి లక్ష్మీరాయ్ ఆపుకోలేకపోయింది. వెంటనే పవర్ స్టార్ తో సెల్ఫీ దిగి అప్ లోడ్ చేసేసింది. ప్రస్తుతం ఆమె అప్ లోడ్ చేసిన ఫొటోలు నెట్ లో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి.
Tags:    
Advertisement

Similar News