వరంగల్ ఎన్‌కౌంటర్‌పై చర్చకు టిడిపి పట్టు

వరంగల్ జిల్లా తాడ్వాయి అడవులలో జరిగిన ఎన్‌కౌంటర్‌పై చర్చ జరగాలని తెలుగుదేశం పార్టీ శాసనసభలో డిమాండ్ చేసింది. దీనిపై ఆ పార్టీ పట్టుబట్టడంతో సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగింది. ముందుగా రైతుల ఆత్మహత్యల అంశంపై చర్చ పూర్తి అయిన తర్వాత మిగిలిన అంశాలపై చర్చకు వెళదామని మంత్రి హరీష్‌రావు అన్నారు. ప్రతిపక్షం సభ్యులు రైతుల సమస్యలపై గంటల సేపు మాట్లాడారని, తాము మాట్లాడకుండా అడ్డుపడడం సబబు కాదని టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అన్నారు. తాడ్వాయి ఎన్‌కౌంటర్‌పై ప్రజాసంఘాలు బయట […]

Advertisement
Update: 2015-09-30 02:10 GMT

వరంగల్ జిల్లా తాడ్వాయి అడవులలో జరిగిన ఎన్‌కౌంటర్‌పై చర్చ జరగాలని తెలుగుదేశం పార్టీ శాసనసభలో డిమాండ్ చేసింది. దీనిపై ఆ పార్టీ పట్టుబట్టడంతో సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగింది. ముందుగా రైతుల ఆత్మహత్యల అంశంపై చర్చ పూర్తి అయిన తర్వాత మిగిలిన అంశాలపై చర్చకు వెళదామని మంత్రి హరీష్‌రావు అన్నారు. ప్రతిపక్షం సభ్యులు రైతుల సమస్యలపై గంటల సేపు మాట్లాడారని, తాము మాట్లాడకుండా అడ్డుపడడం సబబు కాదని టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అన్నారు. తాడ్వాయి ఎన్‌కౌంటర్‌పై ప్రజాసంఘాలు బయట ఛలో అసెంబ్లీ నిర్వహిస్తున్నాయని, ఇది ముఖ్యమైన అంశమని టీడీపీ పక్షనేత ఎర్రబెల్లి అన్నారు. ప్రజా సంఘాలను, వామపక్ష నాయకులను పోలీసులు అరెస్ట్‌ చేయడం ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే చర్యని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతూ రైతుల సమస్య గంభీరమైనదని, సున్నితమైనదని… అందువల్ల దీనిపై పూర్తిగా చర్చించిన తర్వాత మిగతా అన్ని విషయాలపై చర్చకు వెళదామని కెసిఆర్ అన్నారు. అన్ని పార్టీలు సహకరిస్తేనే సభలో అర్ధవంతంగా చర్చ జరుగుతుందని ఆయన అన్నారు.

Tags:    
Advertisement

Similar News