బాధిత రైతులందరికీ పరిహారం

ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను ఆదుకుంటామని, అందరికీ నష్టపరిహారం అందజేస్తామని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. అనావృష్టితోనే తెలంగాణలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. తొలకరి చినుకులతో విత్తనాలు వేసిన రైతులకు తర్వాత వర్షాభావ పరిస్థితుల కారణంగా నష్టపోయారని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలపై చర్చలో పాల్గొన్న ఆయన అరకొర నీటితో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, అయితే కష్టాలకు వెరసి ఆత్మహత్యలకు పాల్పడవద్దని మంత్రి సభా ముఖంగా విజ్ఞప్తి చేశారు. […]

Advertisement
Update: 2015-09-29 01:23 GMT

ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను ఆదుకుంటామని, అందరికీ నష్టపరిహారం అందజేస్తామని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. అనావృష్టితోనే తెలంగాణలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. తొలకరి చినుకులతో విత్తనాలు వేసిన రైతులకు తర్వాత వర్షాభావ పరిస్థితుల కారణంగా నష్టపోయారని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలపై చర్చలో పాల్గొన్న ఆయన అరకొర నీటితో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, అయితే కష్టాలకు వెరసి ఆత్మహత్యలకు పాల్పడవద్దని మంత్రి సభా ముఖంగా విజ్ఞప్తి చేశారు. ఒకేసారి రుణ మాఫీ అంశం కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉందని ఆయన తెలిపారు. రైతులకు పరిహారం విషయంలో 2014 జూన్‌ 2వ తేదీని ప్రాతిపదికగా తీసుకుంటామని, ఆ తర్వాత జరిగిన ఆత్మహత్యలకు మాత్రమే పరిహారం వర్తింపజేస్తామని ఆయన తెలిపారు.

ఆ తర్వాత కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాట్లాడుతూ రైతులు కొన్ని సంవత్సరాలుగా అప్పులతో బాధ పడుతున్నారని, గత ప్రభుత్వాల విధానాల వల్లే ఈ ఇబ్బంది కలుగుతుందన్న ప్రభుత్వ వాదనలో కొంత నిజం లేకపోలేదని అన్నారు. అయితే కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక కష్టాల నుంచి గట్టెక్కుతామని రైతుల ఆశించారు… కాని మరిన్ని కష్టాలు ఎక్కువయ్యాయని చెప్పారు. రుణ మాఫీ పేరుతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతులను దగా చేసిందని అన్నారు. రైతుల మొత్తం అప్పులు చెల్లిస్తేనే అది రుణమాఫీగా భావించాల్సి ఉంటుందని, విడతలవారీగా రుణ మాఫీ చేయడం వల్ల రైతులకు కొత్త రుణాలు పుట్టడం లేదని, ఏ రైతుకూ 20 శాతం మించి రుణ మాఫీ కాలేదని ఆయన చెప్పారు. గత ప్రభుత్వాలను నిందించడం వల్ల ప్రస్తుతం బాధపడుతున్న రైతుల కష్టాలు తీరవన్న సంగతి ప్రభుత్వం గుర్తించాలని, రుణమాఫీ, అన్నదాతకు వ్యవసాయానికి కావలసిన విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల లేమి గత ప్రభుత్వాల వల్ల జరిగినవి కాదు కదా అంటూ ప్రభుత్వాన్ని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. రుణ మాఫీ ఏకమొత్తంలో చేసి ఉంటే ఆత్మహత్యలు జరిగి ఉండేవి కాదని, రైతులను ఆదుకోవలసిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఇప్పటికైనా గుర్తించాలని కోరారు. వెంటనే కరవు మండలాల ప్రకటన చేయాలని, 1400 మంది రైతు కుటుంబాలను ఆదుకునేందుకు రూ. 60 కోట్లు విడుదల చేయాలని జీవన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. రైతాంగానికి ఆరోగ్యకార్డులు ఇవ్వాలని సూచించారు. నిర్మాణాత్మక సూచనలను ప్రభుత్వం స్వీకరిస్తుందని కేసీఆర్‌ అన్నారు.

Tags:    
Advertisement

Similar News