వచ్చేనెల 7న వైఎస్‌ జగన్ నిరశన దీక్ష

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్‌. జగన్మోహనరెడ్డి వచ్చేనెల 7వ తేదీన నిరవధిక దీక్షను చేపడతారని ఆ పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఈ నెల 15న తలపెట్టిన ఈ దీక్షను అనివార్య కారణాల వల్ల జగన్‌ వాయిదా వేసుకోగా 26న మరోసారి తలపెట్టిన ఈ దీక్షకు ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో వాయిదా పడింది. మళ్ళీ ఈ దీక్షకు ఇపుడు కొత్త తేదీని ప్రకటించారు. వచ్చేనెల 7న దీక్ష ప్రారంభమవుతుందని, కొన్ని అనివార్య కారణాలవల్ల దీక్షా […]

Advertisement
Update: 2015-09-26 03:38 GMT
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్‌. జగన్మోహనరెడ్డి వచ్చేనెల 7వ తేదీన నిరవధిక దీక్షను చేపడతారని ఆ పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఈ నెల 15న తలపెట్టిన ఈ దీక్షను అనివార్య కారణాల వల్ల జగన్‌ వాయిదా వేసుకోగా 26న మరోసారి తలపెట్టిన ఈ దీక్షకు ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో వాయిదా పడింది. మళ్ళీ ఈ దీక్షకు ఇపుడు కొత్త తేదీని ప్రకటించారు. వచ్చేనెల 7న దీక్ష ప్రారంభమవుతుందని, కొన్ని అనివార్య కారణాలవల్ల దీక్షా స్థలాన్ని మారుస్తున్నామని బొత్స తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల సంక్షేమం కోసం వైఎస్‌ జగన్‌ దీక్ష చేస్తుంటే తెలుగుదేశం ప్రభుత్వం అడ్డుకుంటుందని ఆయన ఆరోపించారు. గతంలో చంద్రబాబు ఢిల్లీలోను, హైదరాబాద్‌లోను దీక్షలు చేయలేదా? అపుడు ఆ ప్రభుత్వాలు అనుమతి ఇవ్వలేదా అని వైసీపీ నేత బొత్స ప్రశ్నించారు. కేవలం జగన్‌ మీద కక్ష సాధింపు ధోరణితోనే ఆయన తలపెట్టిన దీక్షను అడ్డుకుంటున్నారని బొత్స ఆరోపించారు.
Tags:    
Advertisement

Similar News