నాగచైతన్య సరసన శృతిహాసన్?

అన్నీ అనుకున్నట్టు జరిగితే స్టార్ హీరోయిన్ శృతిహాసన్ త్వరలోనే నాగచైతన్య సరసన ఆడిపాడనుంది. మలయాళంలో సూపర్ హిట్టయిన ప్రేమమ్ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాలో నటించేందుకు నాగచైతన్య ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే హీరోయిన్ పాత్రకు బాగా ఎక్కువ ప్రాధాన్యం ఉండడంతో కాస్త క్రేజ్ ఉన్న బ్యూటీని పెట్టుకోవాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా బాలీవుడ్ ముద్దుగుమ్మ పరిణీతి చోప్రా కాల్షీట్లు ట్రైచేశారు. కానీ పరిణీతి మాత్రం ప్రస్తుతానికి బాలీవుడ్ కే ఫిక్స్ అవ్వాలని […]

Advertisement
Update: 2015-09-23 19:02 GMT
అన్నీ అనుకున్నట్టు జరిగితే స్టార్ హీరోయిన్ శృతిహాసన్ త్వరలోనే నాగచైతన్య సరసన ఆడిపాడనుంది. మలయాళంలో సూపర్ హిట్టయిన ప్రేమమ్ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాలో నటించేందుకు నాగచైతన్య ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే హీరోయిన్ పాత్రకు బాగా ఎక్కువ ప్రాధాన్యం ఉండడంతో కాస్త క్రేజ్ ఉన్న బ్యూటీని పెట్టుకోవాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా బాలీవుడ్ ముద్దుగుమ్మ పరిణీతి చోప్రా కాల్షీట్లు ట్రైచేశారు. కానీ పరిణీతి మాత్రం ప్రస్తుతానికి బాలీవుడ్ కే ఫిక్స్ అవ్వాలని నిర్ణయించుకుంది. అందుకే స్టోరీ నచ్చినప్పటికీ నో చెప్పేసింది. దీంతో ఇప్పుడు మేకర్స్ శృతిహాసన్ ను సంప్రదించారు. కథ మొత్తం చెప్పారు. శృతి కూడా కథకు ఓకే చెప్పింది. అయితే కాల్షీట్ కేటాయించేది లేనిది ఓ పది రోజుల్లో చెబుతానని పంపించేసింది. మరి చైతూ సరసన నటించడానికి శృతి ఒప్పుకుంటుందా.. వెయిట్ అండ్ సీ..
Shruti Hassan Latest Stills
Tags:    
Advertisement

Similar News