ఏంజెలీనా జోలీకి ఏడుగురు సంతానం!

ఐక్యరాజ్యసమితి రాయబారిగా, సామాజిక సేవా కార్యక్రమాల్లో విశేష సేవలందిస్తున్న హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలీ… సిరియాకు చెందిన ఓ అనాథను దత్తత తీసుకుని మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. జోలీ-పిట్ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉండగా.. ఇప్పటికే ముగ్గురు అనాథలను దత్తత తీసుకున్నారు. ఇప్పుడు మరో చిన్నారిని దత్తత తీసుకోవడంతో వారి సంతానం ఏడుకు చేరింది. ఐక్యరాజ్యసమితి రాయబారిగా కూడా ఉన్న ఏంజెలీనా జోలీ ఇటీవల సిరియాలో పర్యటించారు. ఈ సందర్భంగా అంతర్యుద్ధంలో తల్లిదండ్రులను కోల్పోయిన ముగ్గురు సోదరులను […]

Advertisement
Update: 2015-09-23 19:04 GMT
ఐక్యరాజ్యసమితి రాయబారిగా, సామాజిక సేవా కార్యక్రమాల్లో విశేష సేవలందిస్తున్న హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలీ… సిరియాకు చెందిన ఓ అనాథను దత్తత తీసుకుని మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. జోలీ-పిట్ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉండగా.. ఇప్పటికే ముగ్గురు అనాథలను దత్తత తీసుకున్నారు. ఇప్పుడు మరో చిన్నారిని దత్తత తీసుకోవడంతో వారి సంతానం ఏడుకు చేరింది. ఐక్యరాజ్యసమితి రాయబారిగా కూడా ఉన్న ఏంజెలీనా జోలీ ఇటీవల సిరియాలో పర్యటించారు. ఈ సందర్భంగా అంతర్యుద్ధంలో తల్లిదండ్రులను కోల్పోయిన ముగ్గురు సోదరులను చూసి ఆమె చలించిపోయారు. వారిలో ఒకరిని ఆమె దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
Tags:    
Advertisement

Similar News