తొలిసారి ఓవర్సీస్ లో ఆడియో ఫంక్షన్

అఖిల్ మెగాఎంట్రీకి సంబంధించి ఏ చిన్న ఎలిమెంట్ ను మిస్ అవ్వడానికి ఇష్టపడడం లేదు అక్కినేని కాంపౌండ్. ఇందులో భాగంగా తొలిసారిగా విదేశీల్లో కూడా ఆడియో ఫంక్షన్ సెలబ్రేట్ చేయాలని నిర్ణయించారు. ఓ తెలుగు సినిమా ఆడియో ఫంక్షన్ ను విదేశాల్లో ఇంత భారీ ఎత్తున నిర్వహించడం ఇదే ప్రథమం. ఎల్లుండి సెప్టెంబర్ 26న డల్లాస్ లో అఖిల్ ఆడియో వేడుకను నిర్వహించబోతున్నారు. డల్లాస్ లోని అలెన్ ఐఎస్ డి ఆర్ట్ సెంటర్ లో సాయంత్రం 5 […]

Advertisement
Update: 2015-09-23 19:06 GMT
అఖిల్ మెగాఎంట్రీకి సంబంధించి ఏ చిన్న ఎలిమెంట్ ను మిస్ అవ్వడానికి ఇష్టపడడం లేదు అక్కినేని కాంపౌండ్. ఇందులో భాగంగా తొలిసారిగా విదేశీల్లో కూడా ఆడియో ఫంక్షన్ సెలబ్రేట్ చేయాలని నిర్ణయించారు. ఓ తెలుగు సినిమా ఆడియో ఫంక్షన్ ను విదేశాల్లో ఇంత భారీ ఎత్తున నిర్వహించడం ఇదే ప్రథమం. ఎల్లుండి సెప్టెంబర్ 26న డల్లాస్ లో అఖిల్ ఆడియో వేడుకను నిర్వహించబోతున్నారు. డల్లాస్ లోని అలెన్ ఐఎస్ డి ఆర్ట్ సెంటర్ లో సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు అఖిల్ ఆడియో వేడుకను నిర్వహిస్తారు. ఈ ఫంక్షన్ కు హీరో అఖిల్, హీరోయిన్ సాయేషా, దర్శకుడు వీవీ వినాయక్, ప్రొడ్యూసర్ నితిన్ తో పాటు మ్యూజిక్ డైరక్టర్ అనూప్ కూడా ఎటెండ్ అవుతారు. ప్రవేశం ఉచితం. అఖిల్ టీంకు స్వాగతం పలికేందుకు డల్లాస్ తెలుగు సంఘం ఇప్పటికే సిద్ధమైంది.
Akhil Movie Wallpapers
Tags:    
Advertisement

Similar News