పీవీకి భారతరత్న...తెలంగాణ సిఫార్సు

వచ్చే గణతంత్ర దినోత్సవం నాడు ఇచ్చే అవార్డుల్లో మాజీ ప్రధానమంత్రి పి.వి.నరసింహరావుకు చోటు కల్పించాలని, ఆయనను భారతరత్నతో గౌరవించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. సుమారు 47 పేర్ల జాబితాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఆధ్వర్యంలోని కమిటీ ఆమోదించింది. ఈ జాబితాలోని పేర్లను పద్మ అవార్డులకు పరిశీలించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. భారతరత్న కోసం మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహా రావు పేరును, పద్మవిభూషణ్‌ కోసం ప్రొఫెసర్‌ జయశంకర్‌, విద్యావేత్త […]

Advertisement
Update: 2015-09-15 00:28 GMT
వచ్చే గణతంత్ర దినోత్సవం నాడు ఇచ్చే అవార్డుల్లో మాజీ ప్రధానమంత్రి పి.వి.నరసింహరావుకు చోటు కల్పించాలని, ఆయనను భారతరత్నతో గౌరవించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. సుమారు 47 పేర్ల జాబితాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఆధ్వర్యంలోని కమిటీ ఆమోదించింది. ఈ జాబితాలోని పేర్లను పద్మ అవార్డులకు పరిశీలించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. భారతరత్న కోసం మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహా రావు పేరును, పద్మవిభూషణ్‌ కోసం ప్రొఫెసర్‌ జయశంకర్‌, విద్యావేత్త రాంరెడ్డి పేర్లను, పద్మశ్రీ కోసం విద్యా వేత్త చుక్కారామయ్య తదితర పేర్లతో కూడిన జాబితాను పంపించారు.
Tags:    
Advertisement

Similar News