మునికోటి కుటుంబానికి జగన్‌ పరామర్శ

ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్య చేసుకుని అసువులు బాసిన కాంగ్రెస్‌ కార్యకర్త మునికోటి కుటుంబాన్ని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వై.ఎస్‌. జగన్మోహనరెడ్డి పరామర్శించారు. మునికోటి గురించి, ఆయన కుటుంబం గురించి ఆయన వాకబు చేశారు. ఎలాంటి పరిస్థితి వచ్చినా పార్టీ కోటి కుటుంబానికి అండగా ఉంటుందని ఆయన ప్రకటించారు. అలాగే పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడుతున్న సమయంలో మునికోటిని రక్షించడానికి ప్రయత్నిస్తూ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న శేషాద్రిని, ఆయన కుటుంబ సభ్యులను కూడా జగన్‌ పరామర్శించారు. […]

Advertisement
Update: 2015-08-11 04:37 GMT
ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్య చేసుకుని అసువులు బాసిన కాంగ్రెస్‌ కార్యకర్త మునికోటి కుటుంబాన్ని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వై.ఎస్‌. జగన్మోహనరెడ్డి పరామర్శించారు. మునికోటి గురించి, ఆయన కుటుంబం గురించి ఆయన వాకబు చేశారు. ఎలాంటి పరిస్థితి వచ్చినా పార్టీ కోటి కుటుంబానికి అండగా ఉంటుందని ఆయన ప్రకటించారు. అలాగే పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడుతున్న సమయంలో మునికోటిని రక్షించడానికి ప్రయత్నిస్తూ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న శేషాద్రిని, ఆయన కుటుంబ సభ్యులను కూడా జగన్‌ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదా రాకపోతే రాష్ట్రానికి భవిష్యత్‌ ఉండదని, నిరుద్యోగం తొలగిపోదని, పరిశ్రమలు రావని అన్నారు. కేంద్ర మంత్రులు, ఎంపీలు, చంద్రబాబు ప్రత్యేక హోదాపై తలోరకంగా మాట్లాడుతున్నారని, వీరందరిలో నిలకడ లేని తత్వం కనపడుతోందని దుయ్యబట్టారు. కేంద్రంలో, రాష్ట్రంలోను ప్రభుత్వాలకు ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి పట్ల చిత్తశుద్ది లేదని ఆయన అన్నారు.
Tags:    
Advertisement

Similar News