మరోసారి కాళీగా రజనీకాంత్

ఇప్పటికే ఓసారి కాళి అనే సినిమా టైటిల్ తో మూవీ చేశాడు రజనీకాంత్. 80ల్లో వచ్చిన ఆ సినిమా మాస్ ఎంటర్ టైనర్ గా పేరుతెచ్చుకుంది. ఇప్పుడు తన కొత్త సినిమాకు కూడా అదే పేరు పెట్టే ఆలోచనలో ఉన్నాడు సూపర్ స్టార్. రంజిత్ డైరక్షన్ లో త్వరలోనే చేయనున్న కొత్త సినిమాకు కాళి అనే టైటిల్ పెట్టాలనుకుంటున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. 2 రోజుల్లో సినిమా టైటిల్ ను కూడా ప్రకటించి […]

Advertisement
Update: 2015-07-23 19:18 GMT
ఇప్పటికే ఓసారి కాళి అనే సినిమా టైటిల్ తో మూవీ చేశాడు రజనీకాంత్. 80ల్లో వచ్చిన ఆ సినిమా మాస్ ఎంటర్ టైనర్ గా పేరుతెచ్చుకుంది. ఇప్పుడు తన కొత్త సినిమాకు కూడా అదే పేరు పెట్టే ఆలోచనలో ఉన్నాడు సూపర్ స్టార్. రంజిత్ డైరక్షన్ లో త్వరలోనే చేయనున్న కొత్త సినిమాకు కాళి అనే టైటిల్ పెట్టాలనుకుంటున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. 2 రోజుల్లో సినిమా టైటిల్ ను కూడా ప్రకటించి అప్పుడు షూటింగ్ ప్రారంభించాలనుకుంటున్నారు. మ్యాగ్జిమమ్ షూటింగ్ ను మలేషియాలో పూర్తిచేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే రజనీకాంత్ తో పాటు నటీనటులంతా రిహార్సల్స్ పూర్తిచేశారు. రజనీకాంత్ లింగాలో నటించిన జగపతిబాబు ఈ కొత్త సినిమాలో కూడా ఓ కీలక పాత్రకు ఎంపికయ్యాడు. మరో కీలకపాత్రలో ప్రకాష్ రాజ్ నటిస్తాడు. రాధికా ఆప్టేను హీరోయిన్ గా ఎంపికచేశారు. తళైవ అభిమానులు చాలామంది కాళీ పేరునే పెట్టాలని రజనీకాంత్ కు సూచిస్తున్నారు. కథాపరంగా అదే టైటిల్ అయితే బాగుంటుందని రంజిత్ కూడా ఫీలవుతున్నాడు. సో.. రజనీ ఓకే చెబితే అదే టైటిల్ ను ఫిక్స్ చేసే అవకాశాలున్నాయి.
Tags:    
Advertisement

Similar News