సీపీఎం ఆధ్వ‌ర్యంలో గుత్తి రామకృష్ణ శ‌త‌జ‌యంతి

స్వాతంత్య్ర సమర యోధులు, అనం తపురం జిల్లాలో కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థా పకుల్లో ఒకరైన గుత్తి రామకృష్ణ శతజయంతి వేడుక లను సిపిఎం అనంతపురం జిల్లా కమిటీ ఘ‌నంగా నిర్వహిం చింది.  అనంతపురంలోని ప్రెస్  క్ల‌బ్‌లో జరిగిన శతజయంతి సందర్భంగా ‘అనంత ఆణిముత్యం’ పేరుతో గుత్తి రామకృష్ణ రచన లను పుస్తక రూపంలో తీసుకొచ్చారు. ఈ పుస్తకాన్ని ప్రముఖ రచయిత సింగమనేని నారాయణ ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా సీపీఎం కేంద్ర క‌మిటీ స‌భ్యుడు పాటూరు రామయ్య మాట్లాడుతూ […]

Advertisement
Update: 2015-07-12 21:51 GMT
స్వాతంత్య్ర సమర యోధులు, అనం తపురం జిల్లాలో కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థా పకుల్లో ఒకరైన గుత్తి రామకృష్ణ శతజయంతి వేడుక లను సిపిఎం అనంతపురం జిల్లా కమిటీ ఘ‌నంగా నిర్వహిం చింది. అనంతపురంలోని ప్రెస్ క్ల‌బ్‌లో జరిగిన శతజయంతి సందర్భంగా ‘అనంత ఆణిముత్యం’ పేరుతో గుత్తి రామకృష్ణ రచన లను పుస్తక రూపంలో తీసుకొచ్చారు. ఈ పుస్తకాన్ని ప్రముఖ రచయిత సింగమనేని నారాయణ ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా సీపీఎం కేంద్ర క‌మిటీ స‌భ్యుడు పాటూరు రామయ్య మాట్లాడుతూ గుత్తిరామకృష్ణ స్వాతంత్య్ర సమరయోధులు, జర్నలిస్టు అని.. అంతకుమించి ఆయన అనంతపురం జిల్లాలో కమ్యూనిస్టుపార్టీ వ్యవసాపకు ల్లో ఒకరయిన బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియా డారు. రాయలసీమ ప్రాంత తొలి కథా రచయితగానూ ప్రసిద్ధికెక్కారని చెప్పారు. జర్నలి స్టుగా ఉంటూ పీడిత, బడుగు బలహీన వర్గాల పక్షాన నిజాలను వెలుగులోకి తెచ్చే విధంగా తన కలాన్ని నాట్యం చేయించారని అభివర్ణించారు. ప్రాంతీయ వెనుకబాటుతనాన్ని సాహిత్య రూపంలో చక్కగా ప్రపంచానికి తెలియజేశారన్నారు. ఎంతో నిబద్ధతతో నిరాడంబరతతో తుది శ్వాస వరకు స్ఫూర్తిదాయకంగా మెలిగారన్నారు. ఇలాంటి నాయ కులు నేటి తరం వారికి ఆదర్శప్రాయులన్నారు. అప్పట్లో భావ ప్రకటనా స్వేచ్ఛ ఉండేదని అందుకే రామక్రిష్ణ లాంటి వారు ధైర్యంగా అన్యాయాన్ని వెలుగులోకి తేగలిగారన్నారు. నేడు పరిస్థితులు మారాయన్నారు. సామ్రాజ్య వాదులు, పెట్టుబడి దారుల చేతుల్లో ప్రభుత్వ పాలన నడుస్తోందన్నారు. నూతన సరళీకరణ ఆర్థిక విధానాల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెలుగులోకి తెచ్చే క్రమంలో జర్నలిస్టులపై దాడులు పెరుగుతు న్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎమర్జెన్సీ తర్వాత ఇప్పటి వరకు 76 మంది జర్నలిస్టులు హత్యకు గురయ్యారన్నారు.
Tags:    
Advertisement

Similar News