కనిపించని నాలుగో సింహాన్ని దోచేశారు

కనిపించని నాలుగో సింహం అనే డైలాగ్ విన్న ఎవరికైనా గుర్తొచ్చేది సాయికుమారే. పోలీస్ పాత్రలకు ఓ లుక్, స్టయిల్, ఇమేజ్ తీసుకొచ్చారాయన. ఖాకీ డ్రెస్సులో డైలాగ్ చెబితే చప్పుట్లు, ఈలలతో మారుమోగాల్సిందే. ఈమధ్య విజయవాడ పోలీసులు కూడా కనిపించని నాలుగో సింహం పేరుతో ఓ యాప్ కూడా విడుదల చేశారు. దానికి సాయికుమార్ బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఇలా పోలీస్ పాత్రలకు కేరాఫ్ గా నిలిచిన సాయికుమార్ ఇంట్లో దొంగలుపడ్డారు. ఇళ్లు మొత్తం గుళ్లచేశారు. […]

Advertisement
Update: 2015-06-23 20:00 GMT
కనిపించని నాలుగో సింహం అనే డైలాగ్ విన్న ఎవరికైనా గుర్తొచ్చేది సాయికుమారే. పోలీస్ పాత్రలకు ఓ లుక్, స్టయిల్, ఇమేజ్ తీసుకొచ్చారాయన. ఖాకీ డ్రెస్సులో డైలాగ్ చెబితే చప్పుట్లు, ఈలలతో మారుమోగాల్సిందే. ఈమధ్య విజయవాడ పోలీసులు కూడా కనిపించని నాలుగో సింహం పేరుతో ఓ యాప్ కూడా విడుదల చేశారు. దానికి సాయికుమార్ బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఇలా పోలీస్ పాత్రలకు కేరాఫ్ గా నిలిచిన సాయికుమార్ ఇంట్లో దొంగలుపడ్డారు. ఇళ్లు మొత్తం గుళ్లచేశారు. ఈమధ్య వేసవి సెలవుల్లో వెకేషన్ కోసం కుటుంబ సభ్యులందరితో కలిసి టూర్ కు వెళ్లాడు సాయికుమార్. అదనుకోసం ఎదురుచూసిన దొంగలు చెన్నైలోని సాయికుమార్ ఇంటిలోకి ఎంటరయ్యారు. కట్ చేస్తే ఇళ్లు మొత్తం ఖాళీ. కనిపించిన ప్రతి వస్తువుని ఎత్తుకెళ్లారు. తిరిగొచ్చిన సాయికుమార్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఊరెళ్లేటప్పుడు సమాచారం ఇవ్వనందుకు పోలీసులు, సాయికుమార్ ను సుతిమెత్తగా మందలించారు.
Tags:    
Advertisement

Similar News