అడల్ట్స్ ఓన్లీ అంటూ న్యూడ్ పోస్టర్ వదిలిన కాంట్రవర్సియల్ డైరెక్టర్

ఇంతకు ముంది తీసిన సినిమాలు అన్నీ కాంట్రవర్సీలే. ఏదో ఒక గొడవ. రజినీకాంత్ పేరు మీద తీసిన ‘మై హూ రజినీకాంత్ ‘ ఐతే కోర్టుల చుట్టూ చక్కర్లు కొట్టి మరీ పేరు మార్చుకుని ‘మై హూ పార్ట్ టైమ్ కిల్లర్ ‘ అయ్యింది. ఇక ఇప్పుడు ‘అమ్మ ‘ పేరుతో జయలలిత జీవిత కథ ఆథారంగా సినిమా తీసేస్తున్నాడు. జయలలిత సినిమా అంటే కాంట్రవర్సీకి ఫుల్ చాన్స్ ఉన్నట్లే కదా! ఆ డైరెక్టర్ పేరే ఫైజల్ […]

Advertisement
Update: 2015-06-09 05:08 GMT

ఇంతకు ముంది తీసిన సినిమాలు అన్నీ కాంట్రవర్సీలే. ఏదో ఒక గొడవ. రజినీకాంత్ పేరు మీద తీసిన ‘మై హూ రజినీకాంత్ ‘ ఐతే కోర్టుల చుట్టూ చక్కర్లు కొట్టి మరీ పేరు మార్చుకుని ‘మై హూ పార్ట్ టైమ్ కిల్లర్ ‘ అయ్యింది. ఇక ఇప్పుడు ‘అమ్మ ‘ పేరుతో జయలలిత జీవిత కథ ఆథారంగా సినిమా తీసేస్తున్నాడు. జయలలిత సినిమా అంటే కాంట్రవర్సీకి ఫుల్ చాన్స్ ఉన్నట్లే కదా! ఆ డైరెక్టర్ పేరే ఫైజల్ సైఫ్.

ఇక ప్రస్తుతానికి ఇంకో సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసాడు ఫిల్మ్ మేకర్ ఫైజల్ సైఫ్. సినిమా పేరు ‘అడల్ట్స్ ఓన్లీ ‘. ఆ సినిమాకి సంభందించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఉన్న అమ్మాయి ఫుల్ న్యూడ్‌గా ఫోజ్ ఇచ్చింది. పోస్టర్ చూస్తే ఏ రేంజ్ అడల్ట్ కంటెంట్ ఉంటుందో అర్థం అయిపోతుంది. మా సినిమా మీరు ఇప్పటి వరకు చూడనంత డర్టీ పిక్చర్ అని మరీ నొక్కి చెప్పేస్తున్నాడు. చెప్పడం ఎందుకులే.. పోస్టర్ చూస్తేనే తెలుస్తోంది కంట్రవర్సీస్ కోసం టార్గెట్ చేసిన ఫిల్మ్ ఇదని.

Tags:    
Advertisement

Similar News