ఓటుకు నోటు కేసుపై గవర్నర్ తో కేసీఆర్ చర్చ

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గవర్నర్ నరసింహన్ తో సమావేశమయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం కేసీఆర్ రాజ్ భవన్ వెళ్లి నరసింహన్ ను కలిశారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు కేసు విషయం కేసీఆర్ గవర్నర్ తో చర్చించినట్టు సమాచారం. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ముడుపులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న సంగతి తెలిసిందే. అంతకుముందు స్టీఫెన్ తో టీడీపీ అధ్యక్షుడు, ఏపీ […]

Advertisement
Update: 2015-06-05 04:28 GMT
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గవర్నర్ నరసింహన్ తో సమావేశమయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం కేసీఆర్ రాజ్ భవన్ వెళ్లి నరసింహన్ ను కలిశారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు కేసు విషయం కేసీఆర్ గవర్నర్ తో చర్చించినట్టు సమాచారం. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ముడుపులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న సంగతి తెలిసిందే. అంతకుముందు స్టీఫెన్ తో టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారని, ఇందుకు సంబంధించి ఆడియో రికార్డులు ఏసీబీ వ‌ద్ద ఉన్నాయని తెలంగాణ హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి ప్ర‌క‌టించిన‌. ఈ నేపథ్యంలో కేసీఆర్ గవర్నర్ తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Tags:    
Advertisement

Similar News