మరో కీలకపాత్రలో జగపతిబాబు

 ప్రస్తుత జగపతిబాబు అంత హ్యాపీ నటుడు మరొకరు లేరనే చెప్పాలి. ఎంచక్కా కూతురు పెళ్లి చేశాడు. హీరో క్యారెక్టర్ల కోసం కష్టపడకుండా చక్కగా విలన్ అయిపోయాడు. విలన్ గా సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత మరిన్ని అవకాశాలు రావడంతో ప్రస్తుతం ఫుల్ ఖుషీగా ఉన్నారు జగపతిబాబు. ఈ సీనియర్ హీరో కమ్ ఫ్రెష్ విలన్ కు ఆనందం కలిగించే ఇంకో విషయం కూడా ఉంది. ఇన్నాళ్లూ టాలీవుడ్ కే పరిమితమైన జగపతిబాబు, ఇప్పుడు కోలీవుడ్ లో కూడా […]

Advertisement
Update: 2015-04-28 06:30 GMT
ప్రస్తుత జగపతిబాబు అంత హ్యాపీ నటుడు మరొకరు లేరనే చెప్పాలి. ఎంచక్కా కూతురు పెళ్లి చేశాడు. హీరో క్యారెక్టర్ల కోసం కష్టపడకుండా చక్కగా విలన్ అయిపోయాడు. విలన్ గా సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత మరిన్ని అవకాశాలు రావడంతో ప్రస్తుతం ఫుల్ ఖుషీగా ఉన్నారు జగపతిబాబు. ఈ సీనియర్ హీరో కమ్ ఫ్రెష్ విలన్ కు ఆనందం కలిగించే ఇంకో విషయం కూడా ఉంది. ఇన్నాళ్లూ టాలీవుడ్ కే పరిమితమైన జగపతిబాబు, ఇప్పుడు కోలీవుడ్ లో కూడా డిమాండబుల్ యాక్టర్ అయిపోయాడు. బాలయ్య నటించిన లెజెండ్ సినిమాలో విలన్ గా నటించి తెలుగులో పాపులర్ అయిన జగపతిబాబు.. సేమ్ టైం రజనీకాంత్ నటించిన లింగ సినిమాలో కూడా విలన్ గా నటించి తమిళనాట కూడా పాపులర్ అయ్యాడు. ఇప్పుడా పాపులారిటీనే జగపతిబాబుకు మరో మాంఛి అవకాశాన్ని తెచ్చిపెట్టింది. తమిళ్ లో సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఓ కీలకపాత్ర పోషించడానికి ఒప్పుకున్నాడు జగపతిబాబు. శింబు, త్రిష, తాప్సి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ నేచురల్ డ్రామాలో జగపతిబాబు పాత్ర చాలా కీలకమైందని సమాచారం. మరీ ముఖ్యంగా సెల్వ రాఘవన్ సినిమాల్లో స్ట్రయిట్ విలన్లు ఉండరు. కాబట్టి ఈసారి జగపతిబాబు మరింత కొత్తగా కనిపించనున్నాడనే టాక్ ఇండస్ట్రీ అంతటా వ్యాపించింది. ఈ సినిమా కూడా క్లిక్కయితే జగపతి బాబు తమిళ్ లో కూడా డిమాండ్ కలిగిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోవడం ఖాయం.
Tags:    
Advertisement

Similar News