లయన్ పై క్లారిటీ ఈరోజే

బాలకృష్ణ తాజా చిత్రం లయన్. ఈ సినిమా విడుదలపై ఇప్పటివరకు అధికారిక సమాచారం లేదు. కొందరేమో ఈనెలలోనే రిలీజ్ అవుతుందని చెబుతుంటే.. మరికొందరు మేలో విడుదల చేసే ఛాన్స్ ఉందంటున్నారు. ఎవరు ఎన్ని అంచనాలు వేసినప్పటికీ… బాలయ్య కొత్త సినిమా విడుదలపై సందిగ్దానికి ఈరోజుతో తెరపడుతుంది. లయన్ ఆడియో ఫంక్షన్ ఈరోజు అట్టహాసంగా జరగబోతోంది. ఈ వేదికపైనే సినిమా విడుదల తేదీని ప్రకటించే అవకాశముంది. సరిగ్గా వారం రోజుల కిందట నిర్మాతలు ఇదే విషయాన్ని స్పష్టంచేశారు. బాహుబలి, […]

Advertisement
Update: 2015-04-09 02:51 GMT

బాలకృష్ణ తాజా చిత్రం లయన్. ఈ సినిమా విడుదలపై ఇప్పటివరకు అధికారిక సమాచారం లేదు. కొందరేమో ఈనెలలోనే రిలీజ్ అవుతుందని చెబుతుంటే.. మరికొందరు మేలో విడుదల చేసే ఛాన్స్ ఉందంటున్నారు. ఎవరు ఎన్ని అంచనాలు వేసినప్పటికీ… బాలయ్య కొత్త సినిమా విడుదలపై సందిగ్దానికి ఈరోజుతో తెరపడుతుంది. లయన్ ఆడియో ఫంక్షన్ ఈరోజు అట్టహాసంగా జరగబోతోంది. ఈ వేదికపైనే సినిమా విడుదల తేదీని ప్రకటించే అవకాశముంది. సరిగ్గా వారం రోజుల కిందట నిర్మాతలు ఇదే విషయాన్ని స్పష్టంచేశారు. బాహుబలి, రుద్రమదేవి లాంటి భారీ సినిమాల విడుదల తేదీలు కన్ ఫర్మ్ కాకపోవడంతో లయన్ రిలీజ్ డేట్ ను ఇంకా ఫిక్స్ చేయలేదన్నారు. అయితే ఇప్పుడా సినిమాలతో సంబంధం లేకుండా వీలైనంత త్వరగా లయన్ ను థియేటర్లలోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు. ఇందులో భాగంగానే ఈరోజు రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశముంది. సత్యదేవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో త్రిష,రాధికా ఆప్టే హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News